News February 12, 2025
పాడేరులో మూతబడిన పలు హోటళ్లు

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో బుధవారం బంద్ విరమించినప్పటికీ పలు టీ, టిఫిన్ హోటళ్లు తెరుచుకోలేదు. రెండు రోజుల బంద్ ముందస్తు ప్రకటనతో మంగళవారం పాడేరులో వ్యాపారులు స్వచ్ఛందంగా మూసివేశారు. రెండో రోజు బంద్ కొనసాగుతుందో లేదో అనే సంశయంలో హోటళ్ల యజమానులు సిద్ధం కాలేదు. దీంతో పలు టీ పాయింట్లు, ప్రధాన హోటళ్లు బుధవారం మూతపడ్డాయి.
Similar News
News March 26, 2025
‘అంతరిక్ష వ్యవసాయం’

స్పేస్‌లో జరుగుతున్న పరిశోధనల్లో ఇదీ ఒకటి. ISSకు వెళ్లే వ్యోమగాములకు సరిపడా ఆహారాన్ని ప్రాసెస్డ్ చేసి పంపిస్తుంటారు. అక్కడే వ్యవసాయం చేసుకోగలిగితే వారు స్వయంగా తమ ఆహారాన్ని ఉత్పత్తి చేసుకోగలుగుతారని ఈ పరిశోధన ఉద్దేశం. అలాగే ఆ మొక్కల నుంచి స్పేస్‌లో ఆక్సిజన్ వెలువడుతుంది. అయితే, స్పేస్‌లో సూర్యరశ్మి, నీరు, ఆక్సిజన్, భూమి లేనప్పటికీ అక్కడ మొక్కలు వేగంగా పెరుగుతున్నట్లు సైంటిస్టులు చెబుతున్నారు.
News March 26, 2025
తాడేపల్లి: పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల మృతిపై సీఎం చంద్రబాబు విచారం

హైదరాబాద్‌కు చెందిన పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. పాస్టర్ మృతి ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరపాలని సీఎం ఆదేశించారు. ఈ విషయంపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో మాట్లాడారు. చాగల్లులో జరిగే క్రైస్తవ సభలకు హాజరయ్యేందుకు రాత్రి ద్విచక్ర వాహనంపై రాజమండ్రి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
News March 26, 2025
పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన ఖమ్మం కలెక్టర్

ఖమ్మం జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. ఖమ్మం నగరంలోని రిక్కా బజార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షా సెంటర్‌ను తనిఖీ చేసి, పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు. ఎండ తీవ్రత దృష్ట్యా విద్యార్థులకు చల్లని తాగునీరు సరఫరా చేయాలని, పరీక్ష కేంద్రానికి వచ్చే ప్రతి విద్యార్థినీ క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి అనుమతించాలని తెలిపారు..