News May 19, 2024
పాడేరులో వెల్లువిరిసిన ఇంద్రధనస్సు
అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో ఇంద్రధనస్సు వెల్లువిరిచినట్లు ఆకట్టుకుంది. ఆదివారం ఉదయం నుంచి పాడేరులో వర్షం కురిసింది. ఒక్కసారిగా సాయంత్రం వాతావరణం మారి ఓ పక్కన ఎండ మరో పక్కన పచ్చని కొండల మధ్య ఇంద్రధనస్సు మెరిసి చూసే వాళ్లకు కనువిందు చేసింది.
Similar News
News December 11, 2024
అనకాపల్లి: గోడకూలి ఇద్దరు మృతి
మాకవరపాలెం మండలం కోడూరులో పాత ఇంటి గోడ కూలి ఇద్దరు వృద్ధులు మృతి చెందారు. గ్రామానికి చెందిన వేగి పైడమ్మ ఇంటి వద్ద రోజూ స్థానికులు కూర్చుని మాట్లాడుకుంటారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి ఈ గోడవద్ద మాట్లాడుకుంటున్న కోయిలాడ కాంతం(73), వేడి భీముడు(70) లపై గోడ కూలిపోయింది. దీంతో కాంతం అక్కడికక్కడే మృతి చెందగా, గాయపడ్డ భీముడును 108లో ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
News December 11, 2024
విశాఖ: ‘జ్యూస్‌లో మత్తు మందు కలిపి ఇబ్బందులు పెట్టేది’
విశాఖ హనిట్రాప్ కేసులో బాధితుడి తల్లి మంగళవారం విశాఖలో ప్రెస్‌మీట్ పెట్టింది. తమ బిజినెస్ ప్రోమోట్ చేస్తానని జాయ్ జమియా తన కుమారిడితో పరిచయం పెంచుకుందని తెలిపింది. అమెరికా నుంచి అతనిని వైజాగ్‌కి రప్పించిన ఆమె.. జ్యూస్‌లో మత్తు మందు కలిపి పెట్టిన ఇబ్బందులను వాయిస్ మెసేజ్ ద్వారా తమకు తెలియజేశాడని పేర్కొంది. ఇంకా చాలామంది బాధితులు ఉన్నారని కేసును లోతుగా విచారించాలని పోలీసులను కోరింది.
News December 11, 2024
విశాఖ: 14న అన్ని న్యాయస్థానాల్లోనూ లోక్ అదాలత్
ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్న అన్ని న్యాయస్థానాల్లోనూ ఈనెల 14వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. న్యాయస్థానాల్లో ఉన్న పెండింగ్ కేసులు, సివిల్, చెక్ బౌన్స్, బ్యాంకింగ్, మోటార్ ప్రమాదాల నష్ట పరిహార కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కారం చేసుకోవచ్చునన్నారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.