News April 9, 2025
పాడేరులో 89.31శాతం వాల్యుయేషన్ పూర్తి: డీఈవో

పాడేరులో ఏర్పాటు చేసిన స్పాట్ సెంటర్లో ఇప్పటి వరకు 92,116 టెన్త్ పేపర్స్ మూల్యాంకనం చేసినట్లు DEO బ్రహ్మాజీరావు మంగళవారం తెలిపారు. ఇప్పటి వరకు 89.31శాతం వాల్యుయేషన్ పూర్తి అయ్యిందన్నారు. ఇంకా 11,016 పేపర్స్ మూల్యాంకనం చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఇంగ్లిష్, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ పేపర్స్ను ఈ కేంద్రంలో వాల్యుయేషన్ చేస్తున్నామని తెలిపారు.
Similar News
News December 1, 2025
తిరుపతి: రేపు పాఠశాలలకు సెలవు లేదు: డీఈవో

తిరుపతి జిల్లా వ్యాప్తంగా అన్ని యాజమాన్య పాఠశాలలు మంగళవారం యథావిధిగా కొనసాగుతాయని డీఈవో కుమార్ తెలిపారు. దిత్వా తుఫాను ప్రభావం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఎలాంటి సెలవు లేదని స్పష్టం చేశారు. ఎంఈవోలు, డీవైఈవోలు విద్యార్థులకు సమాచారం అందించి పాఠశాలలు పని చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు.
News December 1, 2025
ALERT: నేటి నుంచి పోలీస్ యాక్ట్ అమలు- SP

మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో శాంతి భద్రతలు సమర్థంగా కొనసాగేందుకు డిసెంబర్ 01 నుంచి డిసెంబర్ 31 వరకు పోలీస్ యాక్ట్–1861లోని సెక్షన్ 30, 30(ఎ) నిబంధనలు అమలులో ఉంటాయని జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనుమతి లేనిదే ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్స్(సభలు) నిర్వహించరాదన్నారు.
News December 1, 2025
గద్వాల జిల్లాలో రెండవ రోజు 205 నామినేషన్లు

గద్వాల జిల్లాల్లో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్లు సోమవారం రెండో రోజు కొనసాగింది. రెండో విడతలో మల్దకల్, అయిజ, వడ్డేపల్లి, రాజోలి మండలాల్లోని క్లస్టర్ కేంద్రాల్లో నామినేషన్లు స్వీకరించారు. మొత్తం 74 సర్పంచ్ స్థానాలు ఉండగా 205 నామినేషన్లు వచ్చాయి. 716 వార్డు స్థానాలకు 341 నామినేషన్లు వచ్చినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. రేపు నామినేషన్లకు చివరి రోజు కావడంతో భారీగా వేసే అవకాశం ఉంది.


