News March 16, 2025

పాడేరు: ‘అన్ని పోలీసు కార్యాలయాల్లో పబ్లిక్ గ్రీవెన్స్’

image

అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ ఆధ్వర్యంలో పబ్లిక్ గ్రీవెన్స్ నిర్వహించడం జరుగుతుందని పాడేరు జిల్లా ఎస్పీ కార్యాలయం అధికారులు శనివారం తెలిపారు. అన్ని మండలాల్లో కూడా స్టేషన్ హౌస్ ఆఫీసర్లు గ్రీవెన్స్ నిర్వహిస్తారని అన్నారు. ఈనెల 17వ తేదీ సోమవారం జిల్లాలోని అన్ని పోలీసు కార్యాలయాల్లో గ్రీవెన్స్ నిర్వహించడం జరుగుతుందని, జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.

Similar News

News October 27, 2025

ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు

image

AP: ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్(మార్చి 2026) ఫస్టియర్, సెకండియర్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఈనెల 31 వరకు పొడిగిస్తున్నట్లు బోర్డు కార్యదర్శి భరత్ గుప్తా పేర్కొన్నారు. ఈనెల 22తో ఆ గడువు ముగియగా తాజాగా పొడిగించారు. లేటు ఫీజు రూ.1,000తో నవంబర్ 6వ తేదీవరకు చెల్లించవచ్చని వివరించారు. మరోసారి ఫీజు చెల్లింపు గడువు పొడిగించేది లేదని స్పష్టం చేశారు.

News October 27, 2025

అల్లూరి: తుఫాను ఎదుర్కొనేందుకు సర్వం సిద్ధం

image

మొంథా తుఫానును ఎదుర్కొనడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టర్ దినేశ్ కుమార్ సోమవారం తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అప్రమత్తంగా ఉన్నామన్నారు. రేపు తుఫాన్ కాకినాడ వద్ద తీరాన్ని తాకే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో వరుసగా మూడు రోజులు భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు. అధికారులు ఇచ్చే సూచనలు పాటిస్తూ ప్రజలు సహకరించాలన్నారు.

News October 27, 2025

GWL: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌లో పొరపాట్లు ఉండరాదు

image

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌లో పొరపాటు లేకుండా గడువులోగా పూర్తి చేయాలని గద్వాల కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. సోమవారం ఐడీఓసీ మందిరంలో సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. 2002 ఎన్నికల జాబితాను ప్రామాణికంగా తీసుకొని 2025 జాబితాతో నియోజకవర్గాల వారిగా మ్యాపింగ్ చేయడం జరిగిందన్నారు. 2002 జాబితాలో ఉన్న వారిని A, లేనివారిని B, 22- 37 మధ్య వయస్సులను C, 18- 21 మధ్య వారిని D కేటగిరీలుగా విభజించామన్నారు.