News March 16, 2025
పాడేరు: ‘అన్ని పోలీసు కార్యాలయాల్లో పబ్లిక్ గ్రీవెన్స్’

అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ ఆధ్వర్యంలో పబ్లిక్ గ్రీవెన్స్ నిర్వహించడం జరుగుతుందని పాడేరు జిల్లా ఎస్పీ కార్యాలయం అధికారులు శనివారం తెలిపారు. అన్ని మండలాల్లో కూడా స్టేషన్ హౌస్ ఆఫీసర్లు గ్రీవెన్స్ నిర్వహిస్తారని అన్నారు. ఈనెల 17వ తేదీ సోమవారం జిల్లాలోని అన్ని పోలీసు కార్యాలయాల్లో గ్రీవెన్స్ నిర్వహించడం జరుగుతుందని, జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
Similar News
News April 17, 2026
NTR జిల్లాలో విషాదం.. ఇద్దరు పిల్లలకు ఉరివేసి.. తల్లి ఆత్మహత్య

ఎన్టీఆర్ జిల్లాలో శుక్రవారం రాత్రి తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విజయవాడ రూరల్ (M) పైడూరుపాడుకి చెందిన కవిత అనే మహిళ తన ఇద్దరు పిల్లలు లాస్య, సాత్విక్‌కు ఉరివేసి, అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. గత ఐదేళ్లుగా కవిత వింతగా ప్రవర్తిస్తున్నట్టు సమాచారం. ఇబ్రహీంపట్నం పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
News April 17, 2026
ఆసుపత్రిలో వైద్యులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి: కలెక్టర్

సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో గోదావరిఖని జనరల్ ఆసుపత్రి పనితీరుపై నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ కోయ శ్రీ హర్ష వైద్యులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఓపీ అనంతరం కూడా విధుల్లో ఉండాలని, ఖాళీలను కాంట్రాక్ట్ ద్వారా భర్తీ చేయాలని సూచించారు. అవసరం లేకుండా ప్రైవేట్ ఆసుపత్రులకు రిఫర్ చేయరాదని స్పష్టం చేశారు. మందులు, పరికరాల కొరత లేకుండా స్టాక్ నిర్వహణ చేయాలని పేర్కొన్నారు.
News April 17, 2026
ఫ్రిజ్‌ను ఆఫ్ చేస్తున్నారా?

ఫ్రిజ్‌ను తరచూ ఆన్ ఆఫ్ చేస్తే కంప్రెసర్‌పై ఒత్తిడి పెరిగి దాని లైఫ్ స్పాన్ తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఒకట్రెండు రోజులు బయటికెళ్తున్నా, రిఫ్రిజరేటర్‌లో పాలు, పెరుగు, పండ్లు, కూరగాయలు ఉన్నా ఆఫ్ చేయొద్దని సూచిస్తున్నారు. వారాలపాటు మీరు ఇంట్లో లేకపోతే ఫ్రిజ్‌ను పూర్తిగా ఖాళీ చేసి ఆఫ్ చేయొచ్చని పేర్కొంటున్నారు. ట్రేలను శుభ్రం చేసి ఆరబెట్టాలని, లేదంటే ఫ్రిజ్ దుర్వాసన వస్తుందంటున్నారు.


