News March 29, 2025
పాడేరు: ఇద్దరు మావోయిస్టుల అరెస్ట్

తడికవాగు శివారు అటవీ ప్రాంతంలో మావోయిస్టు పార్టీకి చెందిన శబరి ఎల్ఓసీ కమాండర్ మడకం మంగ, పార్టీ మెంబర్ మడివి రమేశ్‌ను అరెస్టు చేశామని అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ ప్రకటించారు. పోలీసులను హతమార్చేందుకు ఈ ఇద్దరు సమావేశమయ్యారనే సమాచారంతో కూంబింగ్ చేశామన్నారు. మారణాయుధాలతో వీరిద్దరూ పట్టుబడ్డారని చెప్పారు. తుపాకీ, తూటాలు, కత్తులు తదితర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామన్నారు.
Similar News
News April 17, 2025
మే 8న ఏపీ క్యాబినెట్ భేటీ

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన మే 8న ఏపీ క్యాబినెట్ సమావేశం కానుంది. ఉ.11 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. మే 6 సాయంత్రంలోగా మంత్రివర్గ భేటీలో చర్చించే అంశాలపై ప్రతిపాదనలు పంపాలని అన్ని శాఖలకు ఆదేశాలు ఇచ్చారు. తల్లికి వందనం ఇతర పథకాల అమలుపై నిర్ణయం తీసుకునే అవకాశముంది.
News April 17, 2025
సంగారెడ్డి: ‘రెవెన్యూ పారదర్శకతకు సీఎం ప్రత్యేక కృషి’

రెవెన్యూ శాఖ పారదర్శకత కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి అన్నారు. కొండాపూర్ మండలం మల్కాపూర్‌లో భూభారతి అవగాహన సదస్సు గురువారం నిర్వహించారు. భూ సమస్యలు పరిష్కారం కావాలంటే ఇప్పటివరకు కలెక్టరేట్ చుట్టూ రైతులు తిరిగేవారని, ఈ చట్టంతో అక్కడికక్కడే పరిష్కారం అవుతాయని చెప్పారు. కలెక్టర్ వల్లూరు క్రాంతి, అదనపు కలెక్టర్ మాదురి పాల్గొన్నారు.
News April 17, 2025
రైల్వే స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఎంపీ రమేశ్

డార్జిలింగ్‌లో రైల్వే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం కమిటీ ఛైర్మన్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అధ్యక్షతన గురువారం జరిగింది. స్టడీ టూర్‌లో భాగంగా సమావేశం నిర్వహించినట్లు రమేష్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో రైల్వే ప్రాజెక్టుల ప్రగతిపై సమీక్షించినట్లు తెలిపారు. రైల్వే పనితీరును మరింత మెరుగుపరచాలని సూచించినట్లు వివరించారు. స్టాండింగ్ కమిటీ సభ్యులతో పాటు రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు.