News August 19, 2024

పాడేరు: ఈనెల 19 నుంచి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు

image

పాడేరు డివిజన్ పరిధిలో ఈనెల 19వ తేదీ సోమవారం నుంచి ఐదు రోజులపాటు 35 సంవత్సరాలు దాటిన వారికి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించినట్లు కలెక్టర్ దినేశ్ కుమార్ తెలిపారు. రొమ్ము, గర్భాశయ, నోటి క్యాన్సర్లకు సంబంధించి పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు నిర్వహిస్తున్న ఈ స్క్రీనింగ్ పరీక్షలకు వారితో పాటు ప్రజలు కూడా పరీక్షలు చేయించుకోవచ్చన్నారు.

Similar News

News January 4, 2026

భవిష్యత్తు అంతా పోరాట కాలం: సీఐటీయూ నేతలు

image

భవిష్యత్తంతా పోరాట కాలమని, ఐక్య ఉద్యమాలకు కార్మికవర్గం సిద్ధం కావాలని, ప్రధాని మోదీ జమానాలో ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడిందని విశాఖలో సీఐటీయూ బహిరంగసభలో కార్మిక నేతలు అన్నారు. రాబోయే కాలమంతా పోరాటాలేనని, అందుకు కార్మికవర్గం సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 12న సమ్మెతో చరిత్ర సృష్టించాలన్నారు.

News January 4, 2026

విశాఖ: ప్రభుత్వ కార్యాలయాలలో రేపు పీజీ‌ఆర్ఎస్

image

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) నిర్వహిస్తున్నట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. జీవీఎంసీ జోనల్ కార్యాలయాల్లో, కలెక్టరేట్లో, సీపీ కార్యాలయంలో ఉదయం వినతులు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News January 4, 2026

రేపు విశాఖ పోలీస్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

image

ప్రజల సమస్యల పరిష్కారం కోసం విశాఖ సిటీ పోలీస్ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహిస్తోంది. సీపీ శంఖబ్రత బాగ్చీ ఆదేశాల మేరకు జనవరి 5న ఉదయం 10 గంటల నుంచి ఆర్ముడ్ రిజర్వ్ ఆఫీస్‌లోని పోలీస్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఈ కార్యక్రమం జరుగుతుంది. బాధితులు నేరుగా వచ్చి తమ సమస్యలను విన్నవించుకోవచ్చని, ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించడమే తమ ప్రాధాన్యత అని సీపీ స్పష్టం చేశారు.