News April 6, 2024

పాడేరు: ఎన్నికల ఫిర్యాదులకు అదనంగా మరో 3 నంబర్లు

image

రానున్న సాధారణ ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదులకు ప్రస్తుతం ఉన్న 1950 టోల్ ఫ్రీ నంబరుతో పాటు మరో మూడు ల్యాండ్ లైన్ నంబర్లను అదనంగా ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత తెలిపారు. ఎన్నికల నిభందనలు ఉల్లంఘన, బహుమతులు, నగదు పంపిణీ, అక్రమ తరలింపు, మత్తు పదార్ధాల పంపిణీ, తరలింపు, తదితర ఎన్నికలకు సంబంధించిన అంశాలపై ప్రజలు 08935-299934, 08935-299912, 08935 -293448 నంబర్లకు ఫిర్యాదు చేయవచ్చన్నారు.

Similar News

News December 17, 2025

విశాఖ: ఎస్ఐల బదిలీల్లో మార్పులు

image

నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇటీవల జరిగిన 102 మంది ఎస్ఐల బదిలీల్లో అధికారులు స్వల్ప మార్పులు చేశారు. బుధవారం 18 మంది ఎస్ఐల విన్నపం మేరకు వారిని ఇతర స్టేషన్లకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. బదిలీ అయిన ఎస్ఐలందరూ వెంటనే తమకు కేటాయించిన కొత్త స్టేషన్లలో బాధ్యతలు స్వీకరించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. పారదర్శకత, పరిపాలనా సౌలభ్యం కోసమే ఈ బదిలీలు చేపట్టినట్లు పోలీస్ వర్గాలు వెల్లడించాయి.

News December 17, 2025

విశాఖలో టేట్ పరీక్షకు 152 మంది గైర్హాజరు: డీఈఓ

image

ఉపాధ్యాయ అర్హత పరీక్ష విశాఖలోని ఎనిమిది కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం నిర్వహించారు. ఈ టెట్ పరీక్షకు 1,761 హాజరు కావలసి ఉండగా 1,609 మంది హాజరైనట్లు డీఈఓ ప్రేమ్ కుమార్ తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో తనిఖీలు చేశామని, అభ్యర్థులకు ఆయా కళాశాలలో పరీక్ష రాసిన సమయంలో ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేశామని వివరించారు.

News December 17, 2025

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో రికార్డు ఉత్పత్తి: పల్లా

image

విశాఖ స్టీల్ ప్లాంట్ ఒకే రోజు 21,012 మెట్రిక్ టన్నుల హాట్ మెటల్ ఉత్పత్తి చేసి సరికొత్త రికార్డు సృష్టించిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. డిసెంబర్‌లో ప్లాంట్ 92% సామర్థ్యంతో నడుస్తోందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం రూ.14 వేల కోట్ల నిధులతో ప్లాంట్‌ను ఆదుకుంటోందని, ప్రైవేటీకరణ జరగదని స్పష్టం చేశారు. హాట్ మెటల్‌ను పారబోస్తున్నారన్న ప్రచారం అవాస్తవమని తెలిపారు.