News February 5, 2025
పాడేరు: ‘ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు’

శాసన మండలి ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ దినేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఉపాధ్యాయ MLC, పట్టభద్రుల MLC ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో బుధవారం జూమ్ సమావేశం నిర్వహించారు. ఈనెల 3వ తేదీ నుంచి ఉత్తరాంధ్ర పరిధిలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఉపాధ్యాయ MLC, గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ జరుగుతోందన్నారు.
Similar News
News February 19, 2025
TGలో త్వరలో ఉప ఎన్నికలు: బండి సంజయ్

TG: కాంగ్రెస్ ప్రభుత్వానికి నూకలు చెల్లాయని, ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ‘కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి. ఆ పార్టీ ఎమ్మెల్యేలు సంతోషంగా లేరు. అందుకే రహస్య సమావేశాలు పెడుతున్నారు. రాష్ట్రంలో త్వరలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. 10 స్థానాల్లో 7 సీట్లు బీజేపీ గెలుస్తుంది’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
News February 19, 2025
ఖమ్మం: వడదెబ్బపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలి:కలెక్టర్

ఖమ్మం: వడదెబ్బ బారిన పడకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృత ప్రచారం కల్పించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం వడగాల్పుల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యశాఖ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని, గత సంవత్సరం దాదాపు 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని కలెక్టర్ తెలిపారు.
News February 19, 2025
కామారెడ్డి జిల్లాలో నేటి TOP NEWS

*జిల్లా వ్యాప్తంగా ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు
* విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగొద్దు: KMR కలెక్టర్
* మెరుగైన వైద్య సేవలు అందించాలి: బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి
* లింగంపేట్ PS కు కొత్త సారొచ్చారు
*MLC ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలి: మంత్రి జూపల్లి
* కన్న కూతురిపై అత్యాచారం.. తండ్రికి 7ఏళ్ల శిక్ష..
* BJP నిరుద్యోగులను మోసం చేసింది: TPCC చీఫ్
* వసతుల కల్పనకు ప్రాధాన్యం: రైల్వే జీఎం