News April 25, 2024

పాడేరు: గురుకుల కళాశాలల్లో ప్రవేశాలకు ధరఖాస్తుల ఆహ్వానం

image

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఐటీడీఏ పరిధిలోని 3 బాలికలు, 5 బాలుర గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలల్లో.. ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి అర్హులైన విద్యార్థులు ధరఖాస్తులు చేసుకోవాలని పీవో అభిషేక్ సూచించారు. 2024 సంవత్సరంలో పదవ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని చెప్పారు. మరిన్ని వివరాలకు www.aptwgurukulam.ap.gov.in వెబ్‌సైట్‌ సందర్శించాలని సూచించారు.

Similar News

News April 23, 2025

10th RESULTS: మూడో స్థానంలో విశాఖ జిల్లా

image

పదో తరగతి పరీక్షా ఫలితాల్లో విశాఖ జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం 28,435 మంది పరీక్ష రాయగా 25,346 మంది పాసయ్యారు. 15,045 మంది బాలురులో 13,288(88.32%) మంది, 13,390 మంది బాలికలు పరీక్ష రాయగా 12,058(90.05%) మంది పాసయ్యారు. 89.14 పాస్ పర్సంటైల్‌తో విశాఖ జిల్లా 3వ స్థానంలో నిలిచింది. గతేడాది 8వ స్థానంలో నిలవగా ఈసారి ఐదు స్థానాలు మెరుగుపడింది.

News April 23, 2025

చంద్రమౌళి కుటుంబసభ్యులకు ఫోన్ చేసిన మంత్రి 

image

జమ్మూకశ్మీర్ ఉగ్రవాదుల కాల్పుల్లో విశాఖ వాసి చంద్రమౌళి మృతి పట్ల విశాఖ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి డోలా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాశ్మీర్‌లో ఉన్న చంద్రమౌళి భార్య, కుటుంబ సభ్యులను ఫోన్‌ చేసి ఓదార్చారు. ఉగ్రదాడుల్లో చంద్రమౌళి మృతి బాధాకరమన్నారు. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నా, ఇది హేయమైన చర్య అని పేర్కొన్నారు. చంద్రమౌళి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

News April 23, 2025

విశాఖకు చంద్రమోళి మృతదేహం

image

ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన విశాఖకు చెందిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి చంద్రమోళి మృతదేహాన్ని ఎయిర్ ఇండియా విమానంలో విశాఖ తీసుకురానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆ విమానం విశాఖ చేరుకోనుంది. వేసవి నేపథ్యంలో పాడురంగపురం ప్రాంతానికి చెందిన చంద్రమోళితో పాటు మరో రెండు కుటుంబాలు పహల్గాం టూర్‌కు వెళ్లారు. ఉగ్రమూకల దాడిలో చంద్రమోళి మృతి చెందడంతో పాడురంగపురంలో విషాదచాయలు అలముకున్నాయి.

error: Content is protected !!