News January 26, 2025
పాడేరు: ‘గెడల్లో తవ్వకాలకు అనుమతులు లేవు’

ఇసుక అక్రమ రవాణాపై రెవెన్యూ అధికారులతో సమీక్షించి, అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేలా చర్యలు తీసుకుంటామని అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలోని గెడ్డలు, వాగుల్లో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాను నియంత్రిస్తామన్నారు. అభివృద్ధి పనులు, గిరిజనుల ఇళ్ల నిర్మాణాలకు మాత్రమే ఇసుక సేకరించవచ్చన్నారు. ప్రధాన గెడ్డల్లో ఇసుక తవ్వకాలు, రవాణాకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని స్పష్టం చేశారు.
Similar News
News February 19, 2025
ఆ సంఘటన తర్వాత మారిపోయా: హీరోయిన్

తన జీవితంలో ఏడాది క్రితం జరిగిన యాక్సిడెంట్ వల్ల చాలా విషయాలు నేర్చుకున్నట్లు హీరోయిన్ నభా నటేశ్ తెలిపారు. ప్రమాదం తర్వాత మామూలు స్థితికి వచ్చేందుకు చాలా శ్రమించినట్లు చెప్పారు. ఫిట్‌నెస్ కోసం తీవ్రంగా కష్టపడినట్లు తెలిపారు. దీని వల్ల వర్కౌట్స్ విషయంలో తన ధోరణి మారిందన్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ నిఖిల్ సరసన ‘స్వయంభూ’ సినిమాలో నటిస్తున్నారు.
News February 19, 2025
‘బుక్’ పాలిటిక్స్

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇప్పుడిదే ట్రెండ్ నడుస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు TDP జాతీయ ప్రధాని కార్యదర్శి లోకేశ్ ‘రెడ్’ బుక్ మెయింటేన్ చేస్తున్నామని ప్రకటించారు. తమను ఇబ్బంది పెట్టిన వారి భరతం పడతామని చెప్పారు. ఇప్పుడు తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్న BRS MLC కవిత కూడా ఇటీవల ‘పింక్’ బుక్ అంటూ వ్యాఖ్యానించారు. తాజాగా BJP MP ఈటల ‘కాషాయ’ బుక్ మెయింటేన్ చేస్తున్నట్లు చెప్పారు. దీనిపై మీ కామెంట్?
News February 19, 2025
HYDలో వ్యభిచారం.. పోలీసుల ఫోకస్

గ్రేటర్‌లో హ్యుమాన్ ట్రాఫికింగ్‌పై సైబరాబాద్ పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. విశ్వసనీయ సమాచారంతో వ్యభిచార గృహాలపై మెరుపుదాడులు చేస్తున్నారు. కూకట్‌పల్లిలో వాహనదారులకు సైగలు చేస్తూ వ్యభిచార కార్యకలాపాలకు పాల్పడుతున్న ఏడుగురు మహిళలను మంగళవారం బైండోవర్ చేశారు. గత కొద్ది రోజులుగా KPHB మెట్రో సమీపంలోనూ నిఘా పెట్టారు. వ్యభిచారం నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.