News March 11, 2025
పాడేరు: ‘గ్రామ రెవెన్యూ అధికారి క్షేత్ర సందర్శన తప్పనిసరి’

గ్రామ రెవెన్యూ అధికారి క్షేత్ర సందర్శన తప్పనిసరిగా చేయాలని కలెక్టర్ దినేశ్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్లో సబ్ కల్లెక్టర్స్, 22 మండలాల ఎమ్మార్వోలు, వీఆర్వోలు, గ్రామ, మండల సర్వేయర్లతో మంగళవారం రెవిన్యూ అధికారుల వారాంతపు సమావేశం నిర్వహించారు. ఐవీఆర్ఎస్లో వచ్చిన నివేదికలో గ్రామ రెవిన్యూ అధికారి క్షేత్ర సందర్శనలు చేయటం లేదని పేర్కొన్నారు. ఎమ్మార్వోలు బాధ్యత వహించి, చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Similar News
News November 25, 2025
ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్పై నేడు విచారణ

ఐబొమ్మ రవి కస్టడీలో సహకరించలేదని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఆయన తరఫు న్యాయవాది శ్రీనాథ్ తెలిపారు. మొత్తం ఆయనపై 5 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. ఒక్క కేసులో రిమాండ్ విధించారని, మిగతా కేసుల్లో అరెస్టు కోసం సైబర్ క్రైమ్ పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. ఇవాళ రవి బెయిల్ పిటిషన్పై నాంపల్లి కోర్టులో విచారణ జరగనున్నట్లు పేర్కొన్నారు.
News November 25, 2025
తగ్గిన చమురు దిగుమతులు.. డిస్కౌంట్స్ ఇస్తున్న రష్యా కంపెనీలు

అమెరికా ఆంక్షల కారణంగా కొనుగోళ్లు పడిపోవడంతో రష్యా చమురు కంపెనీలు భారీగా రాయితీలు ఇస్తున్నాయి. జనవరికి డెలివరీ అయ్యే ఒక్కో బ్యారెల్ చమురుపై 7 డాలర్ల వరకు డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తున్నాయి. రష్యా చమురు సంస్థలు రాస్నెఫ్ట్, ల్యూకోయిల్పై అమెరికా, యూరోపియన్ యూనియన్ ఆంక్షలు విధించాయి. మరోవైపు, ఆ దేశం నుంచి కొనుగోళ్లు వద్దంటూ ఒత్తిడి చేస్తుండడంతో భారత రిఫైనరీలూ దిగుమతులు తగ్గించిన సంగతి తెలిసిందే.
News November 25, 2025
VJA: భవానీలకు ఉచిత బస్సులు.. వసతుల కల్పనకు చర్యలు.!

విజయవాడ దుర్గమ్మ ఆలయానికి డిసెంబర్ 11 నుంచి 15 వరకు భవానీలు మాలవిరమణకు రానున్నారు. ఈ ఏడాది ఆరు లక్షల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని అంచనా. ఏర్పాట్లలో భాగంగా బస్టాండ్, రైల్వే స్టేషన్ల నుంచి భక్తుల కోసం 17 ఉచిత బస్సులు ఏర్పాటు చేశారు. వాటర్ బాటిళ్లు, క్లోరినేషన్, కేశఖండనశాలలో సిబ్బంది, ఉచిత ప్రసాదాల పంపిణీ వంటి సదుపాయాలు కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు.


