News June 13, 2024

పాడేరు ఘాట్ వ్యాన్ ప్రమాదంలో బిడ్డ కోసం తల్లి సాహసం

image

పాడేరు ఘాట్‌లో సౌండ్ సిస్టం లోడుతో వెళ్తున్న వ్యాన్ బుధవారం బోల్తా కొట్టిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. పలువురు గాయపడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో తన బిడ్డను రక్షించుకునేందుకు ఓ తల్లి సాహసం చేసింది. వ్యాన్ కింద నలిగిపోతున్న బిడ్డకు ఏమీ కాకుండా కౌగిలిలో వదలకుండా పట్టుకుంది. దీంతో వారిద్దరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బిడ్డకు ఏమీ కాకుండ తల్లి చేసిన సాహసాన్ని చూసి పలువురు ప్రశంసిస్తున్నారు.

Similar News

News November 16, 2025

విశాఖలో అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి: మంత్రి

image

జీవీఎంసీ, VMRDA సంయుక్తంగా చేపడుతున్న పనులు వెంటనే పూర్తి చేయాలని మంత్రి నారాయణ సూచించారు. VMRDA కార్యాలయంలో అర్ధరాత్రి వరకు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, VMRDA కమిషనర్ తేజ్ భరత్, అధికారులతో పలు అంశాలపై చర్చించారు. ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ రోడ్లను అభివృద్ధి చేయాలని మంత్రి సూచించారు. లేఔట్‌లో మౌలిక వసతులు ఉండేలా చూడాలన్నారు.

News November 15, 2025

వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఎండీతో మంత్రి లోకేశ్ భేటీ

image

మంత్రి నారా లోకేశ్, వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఎండి జెరేమి జుర్గెన్స్‌తో భేటీలో గ్రీన్ ఎనర్జీ, సైబర్‌సెక్యూరిటీ రంగాల్లో సహకారం కోరారు. ఆంధ్రప్రదేశ్‌ను గ్రీన్ ఎనర్జీ హబ్‌గా మార్చేందుకు 115 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యాన్ని వెల్లడించారు. గ్రీన్ హైడ్రోజన్ జాతీయ లక్ష్యంలో 30% ఏపీలోనే సాధించాలని తెలిపారు.

News November 15, 2025

ఇఫ్కో ఛైర్మన్‌తో సీఎం చర్చలు

image

విశాఖలో జరుగుతున్న సమ్మిట్‌లో ఇఫ్కో ఛైర్మన్ దిలీప్ ననూభాయ్ సంఘానీతో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. గ్రీన్ అమ్మోనియా, హైడ్రోజన్ ఆధారిత ఫెర్టిలైజర్ ప్లాంట్ల ఏర్పాటు, రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించే అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. బయో-ఫర్టిలైజర్, బయో-స్టిమ్యులెంట్ యూనిట్ల స్థాపనకు ఉన్న అవకాశాల పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు.