News August 11, 2024
పాడేరు: జాతీయ జెండాను ఆవిష్కరించనున్న జిల్లా కలెక్టర్

ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించనున్నారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్టీఆర్ జిల్లాలో సీఎం చంద్రబాబు, కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మిగిలిన జిల్లాల్లో మంత్రులు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. కానీ అల్లూరి జిల్లాలో ఆ అవకాశం కలెక్టర్కు లభించింది.
Similar News
News October 17, 2025
విశాఖ డీఆర్వో Vs ఆర్డీవో

విశాఖ DRO భవానీ శంకర్, RDO శ్రీలేఖ మధ్య కోల్డ్ వార్ తారాస్థాయికి చేరింది. డీఆర్వోపై కలెక్టర్కు ఆర్డీవో ఇటీవల లేఖ రాయగా.. రెవెన్యూ సిబ్బంది కలెక్టర్ను శుక్రవారం కలిసి వినతిపత్రం అందించినట్లు సమాచారం. పచారీ సరుకుల కోసం తహశీల్దార్లకు ఇండెంట్లు పెడుతున్నారన్న RDOఆరోపణలపై ‘అవగాహన లేని అధికారి చేసిన ఆరోపణలపై స్పందించాల్సిన అవసరం లేదని’ DRO అన్నారు. కలెక్టర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
News October 17, 2025
విశాఖ: రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి

ఆరిలోవ BRTS రోడ్డులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. విజయనగరం (D)కి చెందిన వినయ్ పురుషోత్తపురంలో ఉంటూ విశాఖలోని ఓ కాలేజీలో చదువుతున్నాడు. స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లాడు. వినయ్ తన మిత్రుడు ఉదయ్తో తిరిగొస్తుండగా బైక్ అదుపుతప్పి డివైడర్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో వినయ్ తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఉదయ్ చికిత్స్ పొందుతున్నాడు.
News October 17, 2025
విశాఖలో యాక్సిడెంట్.. నవవధువు మృతి

విశాఖలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నవవధువు మృతి చెందింది. దువ్వాడ పోలీసుల వివరాల ప్రకారం.. గాజువాక నుంచి స్టీల్ ప్లాంట్ వైపుగా స్కూటీపై వెళ్తోన్న దంపతులను కూర్మన్నపాలెం జంక్షన్లో RTC బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఉమాదేవి అక్కడికక్కడే మృతి చెందింది. భర్త పైడిరాజు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. పెదగంట్యాడ (M) సీతానగరానికి చెందిన ఉమాదేవి, పైడిరాజుకి 4 నెలల క్రితమే పెళ్లి అయింది.