News March 8, 2025
పాడేరు: జిల్లాలో మరో 10వేల ఎకరాల్లో కాఫీ తోటలు

అల్లూరి జిల్లాలో మరో 10వేల ఎకరాల్లో కాఫీ తోటలు పెంచేందుకు కృషి చేస్తున్నామని కాఫీ బోర్డు అసిస్టెంట్ డైరెక్టర్ అప్పలనాయుడు పాడేరులో శనివారం తెలిపారు. ITDA. ఆధ్వర్యంలోని చింతపల్లి ఏరియాలోని నర్సరీలో మొక్కలు పెంచుతున్నామని, వీటిని వచ్చే వర్షకాలంలో నాటేందుకు రైతులకు ఉచితంగా అందజేస్తామ్మన్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో దాదాపు 2.5లక్షల ఎకరాల్లో ఈ పంట పండుతుందని అన్నారు.
Similar News
News July 6, 2025
HYD: 95 ఏళ్లు.. చెక్కుచెదరని అషుర్‌ఖానా!

HYDలోని ‘అజా ఖానే జెహ్రా’ అషుర్‌ఖానా మొహర్రం సందర్భంగా ప్రత్యేక ఆకర్షణగా మారింది. 1930లో చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తల్లి జెహ్రా బేగం జ్ఞాపకార్థం నిర్మించిన ఈ అషుర్‌ఖానా దక్షిణ భారతదేశంలో అతిపెద్దదిగా నిలిచిందని చరిత్రకారులు చెబుతున్నారు. శియా భక్తుల పవిత్ర స్థలంగా పేరుగాంచిన ఈ కట్టడం మూసీ నది ఒడ్డున ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. నేడు ఈ దుఃఖ మందిరానికి భారీగా ముస్లింలు తరలిరానున్నారు.
News July 6, 2025
తొలి ఏకాదశి రోజు ఏం చేయాలంటే?

ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి/శయన ఏకాదశి అంటారు. ఈరోజు నుంచి విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తారని నమ్ముతారు. ఉదయాన్నే తలస్నానం చేసి విష్ణువును తులసి దళాలతో పూజిస్తారు. ఈరోజు పూజించడం వల్ల ఆయన అనుగ్రహం లభిస్తుందని, ఏకాదశి రోజున ఉపవాసముంటే మోక్షం కలుగుతుందని నమ్ముతారు. అలాగే ఈ ఒక్కరోజు ఉపవాసముంటే సంవత్సరంలోని అన్ని ఏకాదశుల ఉపవాస ఫలితం లభిస్తుందని పండితులు చెబుతారు.