News April 4, 2025
పాడేరు: తాగునీటి సమస్య పరిష్కారానికి టోల్ ఫ్రీ నంబర్లు

వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా అన్ని చర్యలు చేపట్టామని కలెక్టర్ దినేశ్ కుమార్ గురువారం తెలిపారు. జిల్లాలోని 3 ఐటీడీఏల్లో టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేశామన్నారు. తాగునీటి సమస్యలను వెంటనే పరిష్కరిస్తామన్నారు. తాగునీటి సమస్యలపై వచ్చే ఫిర్యాదులను ప్రతిరోజూ పర్యవేక్షిస్తామన్నారు. కలెక్టరేట్‌లో 18004256826, పాడేరు ఐటీడీఏలో 8935250833, రంప 18004252123, చింతూరు 8121729228 నంబర్లు ఏర్పాటు చేశామన్నారు.
Similar News
News April 13, 2025
ఎన్టీఆర్: అమరావతి శంకుస్థాపనకు చురుకుగా ఏర్పాటు

ఈనెల 24-26 తేదీల మధ్య రాజధాని అమరావతి పునః నిర్మాణ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో ప్రజలను సమీకరణ చేయనున్నారు. సుమారు 5 నుంచి 5 లక్షల మధ్య ప్రజలు రానున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సులు సిద్ధం చేస్తున్నారు. అతిథుల కోసం 4 హెలీప్యాడ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
News April 13, 2025
ASF : BRS సిద్ధమా.. పూర్వ వైభవం వచ్చేనా..!

రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత స్తబ్దుగా ఉన్న BRS రజతోత్సవ సభ ఏర్పాటుచేస్తుండటంతో పార్టీ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది. ఆసిఫాబాద్, సిర్పూర్ శ్రేణులకు ఇప్పటికే MLA కోవ లక్ష్మి, సిర్పూర్‌లో రాష్ట్ర నేత RS ప్రవీణ్‌కుమార్ దిశానిర్దేశం చేశారు. సభకు భారీగా తరలివెళ్లి పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేలా సమాయత్తమవుతున్నారు. ఇది స్థానిక పోరుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి. దీనిపై మీ కామెంట్?
News April 13, 2025
వైసీపీ పీఏసీ మెంబెర్‌గా మాజీ ఎంపీ బెల్లాన

మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌కు వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి కీలక బాధ్యతలు అప్పగించారు. బెల్లానను పొలిటికల్ అడ్వైజరీ కమిటీ ( PAC) మెంబర్‌గా నియమిస్తూ తాడేపల్లి పార్టీ కార్యాలయం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్.జగన్ ఆదేశాల మేరకు 17 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తూ జాబితాను విడుదల చేసింది.