News April 12, 2025
పాడేరు: త్రైమాసిక జాబ్ మేళా క్యాలెండర్ ఆవిష్కరించిన కలెక్టర్

రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి త్రైమాసిక జాబ్ మేళా క్యాలెండర్ను కలెక్టర్ దినేశ్ కుమార్ పాడేరు ఐటీడీఏలో శుక్రవారం ఆవిష్కరించారు. ఈనెల 17వ తేదీన అరకులోయ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో జాబ్ మేళా జరుగుతుందని, మే 2వ తేదీన పాడేరులో, అదేవిధంగా జూన్ 6వ తేదీన రంపచోడవరంలో ఈ మెగా జాబ్ మేళాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
Similar News
News December 12, 2025
భద్రకాళి అమ్మవారికి అలంకరణ

వరంగల్ శ్రీ భద్రకాళి దేవస్థానంలో ఆలయ అర్చకులు ఉదయాన్నే భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. ప్రాతఃకాల విశేష దర్శనంలో అమ్మవారు దర్శనమిచ్చారు. అనంతరం అమ్మవారికి విశేష పూజలు చేసి హారతి ఇచ్చారు. భక్తులు ఉదయం నుంచి ఆలయం చేరుకొని అమ్మవారిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. దేవస్థాన అర్చకులు తదితరులు ఉన్నారు.
News December 12, 2025
MBNR : భూత్పూర్లో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు

మహబూబ్నగర్ జిల్లాలో వారం రోజులుగా చలి తీవ్రత గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో భూత్పూర్లో 9.4 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. సిరి వెంకటాపుర్ 9.7°C, దోనూరు 9.8°C, పారుపల్లి 10.4°C ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. తీవ్రమైన చలి కారణంగా వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు.
News December 12, 2025
అన్నమయ్య: ‘అడవుల్లో కాలినడకన వెళ్తున్నారా’

అన్నమయ్య, తిరుపతి జిల్లాలో వ్యాపించి ఉన్న శేషాచలం అడవుల్లో భక్తులు కాలినడకన వెళ్లవద్దని జిల్లా అటవీశాఖ అధికారి జగన్నాథ్ సింగ్, ఎస్పీ ధీరజ్ సూచించారు. రాజంపేటలో వారు మాట్లాడుతూ.. శేషాచలం అడవుల్లో క్రూర మృగాలు, చిరుత పులులు, ఏనుగులు సంచరిస్తున్నాయని అన్నారు. గతంలో కాలిబాటన వెళ్లిన భక్తులు ముగ్గురు చనిపోయారని వారు హెచ్చరించారు.


