News March 11, 2025
పాడేరు: నేటి ఇంటర్ పరీక్షలకు 654 మంది దూరం

అల్లూరి జిల్లాలో మంగళవారం జరిగిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ జనరల్ పరీక్షకు 6,468 మంది హాజరు కావాల్సి ఉండగా 6,028 మంది హాజరయ్యారు. 456 మంది గైర్హాజరు అయినట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి అప్పలరాం తెలిపారు. 8 కళాశాలల్లో జరిగిన ఒకేషనల్ పరీక్షకు 1,298 మందికి గాను 1,100మంది హాజరు కాగా..198 మంది గైర్హాజరు అయ్యారు.
Similar News
News March 22, 2025
గద్వాల: ఈ ఫొటోకు ఐదేళ్లు..!

కరోనా కారణంగా జోగులాంబ గద్వాల జిల్లాలో నేటికి జనతా కర్ఫ్యూ విధించి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రతి ఒక్కరూ కూడా చాలావరకు సోషల్ మీడియా ద్వారా జనతా కర్ఫ్యూ పేరిట పోస్టులు చేసుకుంటున్నారు. నాటి గద్వాల కర్ఫ్యూపై తీసిన ఫొటో ఐదేళ్లు పూర్తి చేసుకుందని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది.
News March 22, 2025
GNT: సీఎంవోలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

సీఎంవోలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్ల పోస్టుల భర్తీకి శనివారం రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా సీఎంవోలో పనిచేయడానికి ఫోటోగ్రాఫర్లు-3, వీడియోగ్రాఫర్లు-2 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. వీరికి నెలకు రూ.70,000 వేతనం చెల్లిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
News March 22, 2025
డీలిమిటేషన్ అమలైతే మనల్ని ద్వితీయ శ్రేణి పౌరుల్లా చూస్తారు: CM రేవంత్

TG: డీలిమిటేషన్ విషయంలో BJPని అడ్డుకోవాలని CM రేవంత్ అఖిలపక్ష సమావేశంలో పిలుపునిచ్చారు. ‘జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేస్తే పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల స్వరం వినిపించదు. మనల్ని ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తారు. మనవద్దే అభివృద్ధి ఎక్కువ. అయినప్పటికీ నిధుల్లో వివక్ష చూపిస్తున్నారు. రూపాయి పన్ను కట్టే తెలంగాణకు 42 పైసలే ఇస్తున్నారు. కానీ బిహార్‌కు రూపాయికి రూ. ఆరు ఇస్తున్నారు’ అని పేర్కొన్నారు.