News December 13, 2024
పాడేరు: నేటి నుంచి రెవన్యూ సదస్సులు

ఈనెల 13వ తేదీ నుంచి జనవరి 10వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ గురువారం తెలిపారు. జిల్లాలోని 22మండలాల్లో 2,969 రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతోందన్నారు. గ్రామ సభలు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారన్నారు. భూ, ఇతర రెవెన్యూ సమస్యలపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, పరిష్కార చర్యలు చేపడతామన్నారు.
Similar News
News December 8, 2025
MVP రైతు బజార్ నుంచి ఆన్లైన్లో కూరగాయలు

MVP రైతు బజార్ నుంచి ఆన్లైన్లో కూరగాయలు లభ్యమవుతున్నాయి. పైలెట్ ప్రాజెక్టుగా విశాఖలో అమలు చేస్తున్న అధికారులు దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నారు. రైతు బజార్ ధరలకే డోర్ డెలివరీ చేస్తున్నారు. మాచింట్ సొల్యూషన్స్ అనే సంస్థ https://digirythubazaarap.com వెబ్సైట్ ద్వారా 5 రోజులుగా 150 మందికి డెలివరీ చేసింది. ప్రస్తుతం ఎలాంటి అదనపు చార్జీలు లేవు.
News December 8, 2025
విశాఖ కలెక్టరేట్ నేడు PGRS కార్యక్రమం

విశాఖ కలెక్టరేట్లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. అర్జీదారులు పూర్తి వివరాలతో వినతులు సమర్పించాలని, పరిష్కార వివరాలు వాట్సాప్, పోస్టులో పంపిస్తామన్నారు. ఫిర్యాదుల నమోదు, స్థితి తెలుసుకునేందుకు 1100 కాల్ సెంటర్, meekosam.ap.gov.in వెబ్సైట్ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.