News December 13, 2024

పాడేరు: నేటి నుంచి రెవన్యూ సదస్సులు

image

ఈనెల 13వ తేదీ నుంచి జనవరి 10వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ గురువారం తెలిపారు. జిల్లాలోని 22మండలాల్లో 2,969 రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతోందన్నారు. గ్రామ సభలు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారన్నారు. భూ, ఇతర రెవెన్యూ సమస్యలపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, పరిష్కార చర్యలు చేపడతామన్నారు.

Similar News

News January 21, 2025

ఆ ముఠాలో పెద్ద తలకాయలు ఉన్నాయి: విశాఖ సీపీ

image

క్రికెట్ బెట్టింగ్ ముఠాలో ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు విశాఖ సీపీ డా. శంఖబ్రత బాగ్చీ తెలిపారు. మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొన్ని విషయాలను పబ్లిక్‌గా చెప్పలేమన్నారు. ఇందులో పెద్ద తలకాయలు ఉన్నాయని వాళ్లను కచ్చితంగా పట్టుకుంటామన్నారు. ఇదే కేసులో ఓ హెడ్ కానిస్టేబుల్‌ని సస్పెండ్ చేసి ఎంక్వైరీకి ఆదేశించామన్నారు.

News January 21, 2025

అల్లూరి విగ్రహానికి నల్లరంగు..!

image

విశాఖలోని స్వతంత్ర నగర్ పార్కులో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి గుర్తుతెలియని వ్యక్తులు నల్లరంగు పూశారు. సీపీఐ మధురవాడ కార్యదర్శి వాండ్రాసి సత్యనారాయణ పీఎంపాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై సీఐ స్పందించి విచారణ చేయాలని సిబ్బందికి ఆదేశించారు. కానిస్టేబుల్ లోవరాజు అల్లూరి విగ్రహాన్ని మంగళవారం పరిశీలించారు. సీసీ కెమెరాలను పరిశీలించి నిందితులను గుర్తిస్తామని తెలిపారు.  

News January 21, 2025

స్టీల్ ప్లాంట్‌ను కాపాడింది చంద్రబాబే: మంత్రి కొల్లు

image

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడింది చంద్రబాబే అని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మంగళవారం విశాఖ టీడీపీ కార్యాలయంలో మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ వల్లే ఈ రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో కేవలం భూదోపిడి కోసమే స్టీల్ ప్లాంట్ వ్యవహారాన్ని నడిపారని విమర్శించారు. విశాఖ రైల్వే జోన్‌కు ప్రధానితో శంకుస్థాపన చేయించడం జరిగిందన్నారు.