News February 11, 2025
పాడేరు: పదో తరగతి పరీక్షలు వాయిదా

మన్యం బంద్‌తో అల్లూరి జిల్లాలో 11,12న జరగవలసిన పదో తరగతి ప్రి ఫైనల్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు DEO బ్రాహ్మజిరావు సోమవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ నెల 21న హిందీ, 22న ఇంగ్లిష్ పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. విద్యాశాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.
Similar News
News November 1, 2025
మందమర్రి: ఏరియాలో 65% బొగ్గు ఉత్పత్తి

అక్టోబర్ నెలకు గాను మందమర్రి ఏరియాలో నిర్దేశించిన లక్ష్యానికి 65% బొగ్గు ఉత్పత్తి సాధించామని జీఎం రాధాకృష్ణ చెప్పారు. బొగ్గు ఉత్పత్తి వివరాలను శుక్రవారం వెల్లడించారు. భూగర్భ గనుల కార్మికుల గైర్హాజర్ మూలంగా ఆశించిన బొగ్గు ఉత్పత్తి సాధించడం లేదన్నారు. రానున్న రోజుల్లో బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి చేరుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. అధికారులు సూపర్వైజర్లు సమష్టిగా కృషి చేయాలన్నారు.
News November 1, 2025
ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా ప్రజా పాలన విజయోత్సవాలు: Dy.CM

TG రైజింగ్, రాష్ట్ర ఆవిర్భావం, అభివృద్ధి అంశాలు కలగలిపి ఒక సమగ్ర ప్రణాళికతో ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా ప్రజా పాలన విజయోత్సవాలు (DEC 1-9) నిర్వహించాలని Dy.CM భట్టి అన్నారు. భవిష్యత్తులో TG ఏం సాధించబోతుందనే విషయాలను ప్రపంచానికి వివరించేలా కార్యక్రమాలు ఉండాలని సమీక్ష సమావేశంలో అధికారులకు సూచించారు. విజయోత్సవాలకు పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నామని, భారీగా MOUలు జరిగేలా వాతావరణం ఉండాలన్నారు.
News November 1, 2025
హెడ్మాస్టర్లు, ఉపాధ్యాయులు హెడ్‌క్వార్టర్స్‌లోనే ఉండాలి: KMR DEO

జుక్కల్ నియోజకవర్గంలో కొందరు ఉపాధ్యాయులు హెడ్‌క్వార్టర్స్‌లో ఉండటం లేదని, పాఠశాల సమయాల్లో బయటకు వెళ్తున్నారని MLA కాంతారావు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై కామారెడ్డి జిల్లా విద్యాధికారి ఎస్.రాజు అన్ని మండల విద్యాధికారులు, హెడ్మాస్టర్లు, ఉపాధ్యాయులు తప్పనిసరిగా హెడ్‌క్వార్టర్స్‌లోనే ఉండాలని, పాఠశాల సమయాల్లో స్కూల్ వదిలి వెళ్లకూడదని ఉత్తర్వులు జారీ చేశారు.


