News February 11, 2025
పాడేరు: పదో తరగతి పరీక్షలు వాయిదా

మన్యం బంద్‌తో అల్లూరి జిల్లాలో 11,12న జరగవలసిన పదో తరగతి ప్రి ఫైనల్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు DEO బ్రాహ్మజిరావు సోమవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ నెల 21న హిందీ, 22న ఇంగ్లిష్ పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. విద్యాశాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.
Similar News
News March 22, 2025
అచ్చంపేట: ప్రమాదకరంగా మారిన కల్వర్టు

అచ్చంపేట మండల పరిధిలోని నడింపల్లి గ్రామ శివారులో ప్రధాన రహదారిపై ఉన్న కల్వర్టుకు రక్షణ లేక ప్రమాదకరంగా మారింది. ఈ ప్రధాన రహదారిపై రోజుకు హైదరాబాద్, దేవరకొండ ప్రాంతాలకు వందల సంఖ్యలో వాహనాలు వెళుతుంటాయి. ఈ రహదారి పై ఉన్న కల్వర్టుకు రెండు వైపులా ఎలాంటి రెయిలింగ్ లేకపోవడంతో వాహనదారులు ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. రాత్రి సమయాల్లో ఈ రూట్లో ప్రయాణం చేయాలంటే భయంగా ఉందని ప్రయాణికులు వాపోతున్నారు.
News March 22, 2025
ఫారంపాండ్‌తో రైతులకు ఎంతో ప్రయోజనం: కలెక్టర్

ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా కూడేరు మండలం చోళ సముద్రంలో రైతు ఎర్రస్వామి పొలంలో ఫారంపాండ్ ఏర్పాటుకు సంబంధించి భూమిపూజ పనులను శనివారం కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఫారంపాండ్ పనులకు భూమిపూజ చేశామన్నారు. ఫారంపాండ్‌తో రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు.
News March 22, 2025
నిజామాబాద్ జిల్లాకు రేపు ముఖ్యమంత్రి రాక..!

నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం నర్సింగ్‌పల్లిలోని ఇందూరు తిరుమలలో వార్షిక బ్రహోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం జరిగే స్వామివారి కల్యాణానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారని ఆలయ ప్రతినిధులు తెలిపారు. ఈ విషయమై భద్రతా ఏర్పాట్ల గురించి అధికారులు, పోలీసులు చర్చిస్తున్నట్లు సమాచారం.