News February 6, 2025
పాడేరు: పర్యాటక గమ్యస్థానాల అభివృద్ధికి ప్రణాళికలు

పర్యాటక గమ్యస్థానాల అభివృద్ధికి సమగ్రమైన ప్రణాళికలు తయారు చేయాలని కలెక్టర్ దినేశ్ కుమార్ సూచించారు. గురువారం కలెక్టరేట్‌లో అరకు చలి ఉత్సవంలో పాల్గొన్న అధికారులతో సమావేశం నిర్వహించారు. టూరిజం ప్రాంతాలను అభివృద్ధి చేసి, సంబంధిత గ్రామాలకు నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తే గిరిజనులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. పర్యాటక ప్రాంతాల అభివృద్ధిలో పంచాయతీరాజ్, అటవీశాఖ, గిరిజన చట్టాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు.
Similar News
News March 23, 2025
అల్లూరి జిల్లాలో టుడే టాప్ న్యూస్

>అల్లూరి: లొంగిపోయిన ఇద్దరు మావోయిస్టులు>అల్లూరి జిల్లాలో ఈ నెల 26వరకూ తేలికపాటి వర్షాలు>రాజవొమ్మంగిలో వర్షం..చల్లబడ్డ వాతావరణం>దేవీపట్నం: ముసురిమిల్లి కాలువతో చెరువులకు నీటి సరఫరా>మూగజీవాల మృత్యుఘోష అధికారులకు పట్టదా>రంపచోడవరం: 4,400 మందికి ఉల్లాస్ పరీక్ష>పాడేరు: జాతీయోద్యమ స్ఫూర్తిని కొనసాగించాలి>అనంతగిరి మండలానికి పదోన్నతిపై ఏడుగురి కార్యదర్శులు.
News March 23, 2025
రాత్రి 11 తర్వాత పడుకుంటున్నారా?

ప్రస్తుత బిజీ జీవితంలో నిద్రాసమయం కుంచించుకుపోతోంది. ఎప్పుడు పడితే అప్పుడే నిద్రకు ఉపక్రమిస్తున్నారు. కానీ రాత్రి 11 గంటల తర్వాత నిద్రపోవడం శరీరానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు. అలా చేస్తే నిద్ర నాణ్యత కోల్పోవడమే కాకుండా జీర్ణక్రియ కూడా దెబ్బతింటుంది. అలాగే నిద్రలేచిన వెంటనే అలసట, నీరసంగా ఉండి ఒత్తిడి, ఆందోళన పెరుగుతాయి. రోగనిరోధకశక్తి బలహీనపడి అనారోగ్యానికి గురవుతారని హెచ్చరిస్తున్నారు.
News March 23, 2025
డబుల్ సెంచరీతో చెలరేగిన రుత్విక్ కళ్యాణ్

కర్నూలులో జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన పోటీల్లో కర్నూలుకు చెందిన రుత్విక్ కళ్యాణ్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. నంద్యాలతో జరిగిన మ్యాచ్‌లో 219 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మరోవైపు ఆదోనితో జరిగిన మ్యాచ్‌లో 122 బంతుల్లో 154 పరుగులు చేసి తన సత్తా చాటాడు. క్రికెట్‌లో అంతర్జాతీయ స్థాయికి రుత్విక్ కళ్యాణ్ చేరుకోవాలని పలువురు ఆకాంక్షించారు.