News April 11, 2025

పాడేరు: ‘పీఎం-జుగా అమలకు సమగ్రమైన సర్వే’

image

ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ యోజన (పీఎం-జుగా) అమలు చేయడానికి సమగ్రమైన సర్వే నిర్వహించాలని కలెక్టర్ దినేశ్ కుమార్ ఆదేశించారు. పీఎం-జుగా అమలుపై శాఖల వారీగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. శుక్రవారం ఐటీడీఏలో అధికారులతో సమావేశం నిర్వహించారు. పీఎం-జుగా సర్వే ప్రొఫార్మాలను జిల్లా అధికారులకు అందించి, సర్వే చేయాలని ఆదేశించారు. జిల్లాలో 521 గ్రామాలు కార్యక్రమం అమలుకు ఎంపిక చేశామన్నారు.

Similar News

News December 4, 2025

పాక్ దివాలా.. అమ్మకానికి జాతీయ ఎయిర్‌లైన్స్

image

IMF ప్యాకేజీ కోసం తమ జాతీయ ఎయిర్‌లైన్స్‌ను అమ్మడానికి పాకిస్థాన్ సిద్ధమైంది. పాక్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(PIA) బిడ్డింగ్ ఈ నెల 23న జరుగుతుందని ఆ దేశ ప్రధాని షరీఫ్ ఓ ప్రకటనలో చెప్పారు. ‘PIAలో 51-100% విక్రయించడం అనేది IMF $7 బిలియన్ల ఆర్థిక ప్యాకేజీ కోసం నిర్దేశించిన షరతులలో భాగం. ఈ సేల్‌కు ఆర్మీ నియంత్రణలోని ఫౌజీ ఫెర్టిలైజర్ కంపెనీ కూడా ముందస్తు అర్హత సాధించింది’ అని అక్కడి మీడియా చెప్పింది.

News December 4, 2025

ఉమ్మడి వరంగల్ జిల్లాలో 850 నామినేషన్లు

image

ఉమ్మడి WGLలో 3వ విడత తొలి రోజు సర్పంచ్ స్థానాలకు 357, వార్డులకు 493కు నామినేషన్లు దాఖలైయ్యాయి. WGLజిల్లాలో 109 GPలకు 51, 946 వార్డులకు 73 నామినేషన్లు, HNKలో 68 GPలకు 62 సర్పంచ్, 634 వార్డులకు 86, ములుగులో 46 GPలకు 11, 408 వార్డులకు 22, జనగామలో 91 GPలకు సర్పంచ్ 41, 800 వార్డులకు 37, MHBDలో 169 సర్పంచి స్థానాలకు 87, 1412 వార్డులకు100, BHPLలో 81 GP లకు 106, 696 వార్డులకు 175 నామినేషన్లు పడ్డాయి.

News December 4, 2025

రూ.97.52 కోట్లతో పర్యాటక అభివృద్ధి పనులు

image

స్వదేశీ దర్శన్ పేరుతో రూ.97.52 కోట్లతో పర్యాటక రంగం అభివృద్ధికి పనులు మొదలయ్యాయని కలెక్టర్ వినోద్ కుమార్ బుధవారం కలెక్టర్ కార్యాలయంలో చెప్పారు. ఇందులో భాగంగా ఆదర్శనగర్ కాల్వలో హౌస్ బోట్ ప్రాజెక్ట్‌ను సూర్యలంక వద్ద ఏర్పాటు చేయాలన్నారు. హరిత రిసార్ట్స్ వద్ద రూ.7.50 కోట్ల నిధులతో అధునాతన హంగులతో అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. స్విమ్మింగ్ పూల్, 10 కాటేజీల పనులు త్వర త్వరగా ముగించాలన్నారు.