News April 11, 2025
పాడేరు: ‘పీఎం-జుగా అమలకు సమగ్రమైన సర్వే’

ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ యోజన (పీఎం-జుగా) అమలు చేయడానికి సమగ్రమైన సర్వే నిర్వహించాలని కలెక్టర్ దినేశ్ కుమార్ ఆదేశించారు. పీఎం-జుగా అమలుపై శాఖల వారీగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. శుక్రవారం ఐటీడీఏలో అధికారులతో సమావేశం నిర్వహించారు. పీఎం-జుగా సర్వే ప్రొఫార్మాలను జిల్లా అధికారులకు అందించి, సర్వే చేయాలని ఆదేశించారు. జిల్లాలో 521 గ్రామాలు కార్యక్రమం అమలుకు ఎంపిక చేశామన్నారు.
Similar News
News July 7, 2025
ఉగ్రవాదంపై BRICS సదస్సులో తీర్మానం

BRICS దేశాలు పహల్గామ్ ఉగ్రదాడిని ముక్త కంఠంతో ఖండించాయి. కౌంటర్ టెర్రరిజంపై తీర్మానం కూడా చేశాయి. ‘క్రాస్ బోర్డర్ టెర్రరిజం సహా అన్ని రకాల ఉగ్రవాద చర్యల కట్టడికి పోరాడతాం. ఉగ్రవాదంపై పోరులో ద్వంద్వ వైఖరిని ఉపేక్షించం. ఉగ్రమూకల అణచివేతలో దేశాల ప్రాథమిక బాధ్యతను గుర్తు చేస్తున్నాం. ఉగ్రవాద వ్యతిరేక సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తాం’ అని బ్రిక్స్ దేశాలు తీర్మానించాయి.
News July 7, 2025
250 హెక్టార్‌లలో ఎకో టూరిజం అభివృద్ధి చేస్తాం: కలెక్టర్

ఇబ్రహీంపట్నంలోని మూలపాడు బటర్‌ఫ్లై పార్క్ వద్ద 250 హెక్టార్‌లలో ఎకో టూరిజం అభివృద్ధి చేస్తామని కలెక్టర్ లక్ష్మీశా అన్నారు. ఆదివారం పర్యాటక రంగ అభివృద్ధి ప్రాజెక్టుల గురించి ఆయన మాట్లాడుతూ.. జంగిల్ సఫారీ, బయోడైవర్సిటీ పార్క్, నేచర్ ట్రయల్స్ ఏర్పాటు ద్వారా మూలపాడు బటర్‌ఫ్లై పార్క్‌లో ఎకో టూరిజం అభివృద్ధి చేసేలా జిల్లా దార్శనిక ప్రణాళిక తయారైందన్నారు.
News July 7, 2025
రూ.23 లక్షలతో దుబాయ్ గోల్డెన్ వీసా

భారత్, బంగ్లాదేశ్ ప్రజలు లక్ష ఏఈడీ (రూ.23.30 లక్షలు)లు చెల్లిస్తే దుబాయ్ గోల్డెన్ వీసా పొందొచ్చు. గతంలో రూ.4.66 కోట్లకుపైగా పెట్టుబడి పెడితే గోల్డెన్ వీసా మంజూరు చేసేది. ఇప్పుడు డైరెక్ట్‌గా డబ్బు చెల్లించి వీసా తీసుకోవచ్చు. ఈ వీసా పొందినవారు తమ ఫ్యామిలీతో దుబాయ్‌లో నివసించవచ్చు. డ్రైవర్లు, పనిమనుషులను ఏర్పాటు చేసుకోవచ్చు. ఏదైనా జాబ్, బిజినెస్ చేసుకునే ఛాన్స్ ఉంది. జీవితకాలం అక్కడే ఉండొచ్చు.