News February 13, 2026

పాడేరు: పీజీఆర్‌ఎస్‌కు 109 ఫిర్యాదులు

image

పాడేరు ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమానికి 109 ఫిర్యాదులు, రెవెన్యూ క్లినిక్‌కు 16 ఫిర్యాదులు అందాయి. కలెక్టర్ దినేష్ కుమార్ వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. రహదారి, తాగునీటి సమస్యలపై అధికంగా ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

Similar News

News March 13, 2026

ప్రొద్దుటూరు: పిజ్జా సర్వర్‌కి గోల్డ్ మెడల్

image

పేదరికం చదువుకు అడ్డంకి కాదని నిరూపించింది ప్రొద్దుటూరుకు చెందిన సువర్ణరెడ్డి తోట సువర్ణ, YV విశ్వవిద్యాలయంలో 2019–2021 విద్యా సంవత్సరంలో MA హిస్టరీ పూర్తి చేసి ప్రతిభ కనబర్చింది. నేడు వైవీయూ స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆమెకు గోల్డ్ మెడల్ అందజేయనున్నారు. చదువు పూర్తయ్యాక ఆర్థిక ఇబ్బందుల కారణంగా.. పిజ్జా సర్వర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆమె భర్త కూడా దినసరి కూలీగా జీవనం సాగిస్తున్నాడు.

News March 13, 2026

భీమేశ్వరుడికి కానుకల వర్షం.. హుండీ ఆదాయం ఎంతంటే?

image

వేములవాడ శ్రీభీమేశ్వర స్వామి ఆలయ ఖజానాకు హుండీ ద్వారా రెండు కోట్ల పదహారు లక్షలకు పైచిలుకు ఆదాయం సమకూరింది. గత 33 రోజుల కాలంలో హుండీలలో సమర్పించిన కానుకలను గురువారం పటిష్ఠమైన బందోబస్తు మధ్య లెక్కించారు. ఈ సందర్భంగా 2,16,65,140/- నగదు, 161 గ్రాముల మిశ్రమ బంగారం, 10 కిలోల 900 గ్రాముల మిశ్రమ వెండి లభించినట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు.

News March 13, 2026

పాలమూరు: కుమారుడిని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా.. తండ్రి మృతి

image

మక్తల్ పట్టణంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జీపు డ్రైవర్ చెన్నారెడ్డి మృతి చెందాడు. దండు ప్రాంతానికి చెందిన చెన్నారెడ్డి తన అనారోగ్యంతో ఉన్న కుమారుడు అభినందన్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లి తిరిగి వస్తుండగా హెచ్పీ పెట్రోల్ బంక్ వద్ద హైదరాబాద్ నుంచి మంగళూరు వెళ్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు జీపును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చెన్నారెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా, గాయపడ్డా కుమారుడిని ఆసుపత్రికి తరలించారు.