News January 25, 2025
పాడేరు: బెస్ట్ ఎలెక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డు అందుకున్న కలెక్టర్

జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్ కు 2024 సంవత్సరానికి బెస్ట్ ఎలెక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డ్ ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.విజయానంద్ చేతుల మీదుగా తీసుకున్నారు. శనివారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన జాతీయ ఓటర్ల దినోత్సవం వేడుకలలో ఈ అవార్డును కలెక్టర్ తీసుకున్నారు. గత ఏడాది ఓటర్ల జాబితా తయారీలో, సమ్మరీ రివిజన్ లో విశేష కృషి చేసినందుకు కలెక్టర్కు ఈ అవార్డును అందుకున్నారు.
Similar News
News November 2, 2025
టాస్ గెలిచిన టీమ్ ఇండియా

ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టీ20లో టాస్ గెలిచిన టీమ్ ఇండియా బౌలింగ్ ఎంచుకుంది.
భారత జట్టు: అభిషేక్ శర్మ, గిల్, సూర్యకుమార్(C), తిలక్ వర్మ, జితేశ్, దూబే, అక్షర్, అర్షదీప్, సుందర్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా
ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్(C), హెడ్, ఇంగ్లిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ షార్ట్, ఓవెన్, స్టోయినిస్, బార్ట్లెట్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, అబాట్
News November 2, 2025
వేములవాడలో విద్యుత్ స్తంభాల తరలింపు

వేములవాడ పట్టణంలోని మెయిన్ రోడ్డులో విద్యుత్ స్తంభాల తరలింపు పనులు చురుగ్గా సాగుతున్నాయి. ప్రధాన రోడ్డు వెడల్పుతో పాటు శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం విస్తరణ పనుల నేపథ్యంలో ఇంతకుముందు ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించి కొత్తవి అమరుస్తున్నారు. ఆలయం దక్షిణం వైపు పాత ఆంధ్రబ్యాంకు వద్ద ఆదివారం నాడు సెస్ సిబ్బంది స్తంభాలు తరలించే క్రమంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా పోలీసులు ట్రాఫిక్ ను మల్లించారు.
News November 2, 2025
భీమన్న చెంతకు.. వేములవాడ రాజన్న కోడెలు

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి కోడెలు శ్రీ భీమేశ్వరాలయానికి తరలి వెళ్తున్న వైనం భక్తులను ఆకట్టుకుంటున్నది. వేములవాడ క్షేత్రంలో ప్రత్యేకమైన కోడెమొక్కు సాంప్రదాయం అనాదిగా కొనసాగుతూ వస్తోంది. వివాహం కోసం, సంతానం కోసం భక్తులు ఎంతో దూరం నుండి వచ్చి రాజన్నకు కోడెమొక్కు చెల్లించుకుంటారు. ప్రస్తుతం అభివృద్ధి కార్యక్రమాల కారణంగా రాజన్న ఆలయంలో కోడెమొక్కులను నిలిపివేసి భీమేశ్వరాలయంలోకి మార్చారు.


