News February 6, 2025
పాడేరు-భద్రాచలం బస్ సర్వీస్ పునఃప్రారంభం

నేటి నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రమైన పాడేరు నుంచి భద్రాచలం బస్ పునఃప్రారంభిస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. పాడేరులో ఉదయం 7:30కు బయలుదేరి చింతూరు, కూనవరం మీదగా భద్రాచలం సాయంత్రం 5గంటలకు చేరుకుంటుందన్నారు. ఇదే సర్వీస్ భద్రాచలంలో రాత్రి 8:30 గంటలకు బయలుదేరి కూనవరం 9:30కి చేరుకుని చింతూరు మీదగా పాడేరు మరుసటి రోజు ఉదయం 6 గంటలకు వెళుతుందన్నారు. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News April 16, 2026
మహిళలకు ఈ క్యాన్సర్ల ముప్పు ఎక్కువ

మహిళలకు వచ్చే క్యాన్సర్ వ్యాధుల్లో సర్వైకల్ (గర్భాశయ ముఖద్వార) క్యాన్సర్ మొదటిస్థానంలో ఉంటుంది. దీని తర్వాత స్థానం రొమ్ము క్యాన్సర్. వీటితోపాటు యూట్రస్ క్యాన్సర్, అండాశయ (ఓవేరియన్) క్యాన్సర్ కూడా ఎక్కువగా వస్తున్నాయి. రొమ్ము క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్ వ్యాధులు వంశపారంపర్యంగా వస్తాయి. వీటిని రాకుండా ఆపలేం కానీ, రాకముందే గుర్తించి అప్రమత్తమై చికిత్స చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.
News April 16, 2026
లోకేశ్ ఎంపిక రాష్ట్ర ప్రగతికి సంకేతం: హెనీ క్రిస్టినా

టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మంత్రి లోకేశ్ ఎంపిక కావడం రాష్ట్ర భవిష్యత్తుకు శుభసూచకమని ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా అన్నారు. రాష్ట్ర గమనాన్ని మార్చే సత్తా లోకేశ్‌కు ఉందని ఆమె కొనియాడారు. యువ నాయకుడిగా ఆయన చేపట్టిన అనేక కార్యక్రమాలు దిగ్విజయమయ్యాయని, పార్టీకి కొత్త ఊపిరి పోశారని ప్రశంసించారు. ఆయన నాయకత్వంలో రాష్ట్రం మరింత ప్రగతి పథంలో పయనిస్తుందన్నారు.
News April 16, 2026
దక్షిణాదికి అన్యాయం జరగదు: మోదీ

డీలిమిటేషన్‌తో ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదని.. తమకు ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలనే భేదం లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఎట్టి పరిస్థితుల్లో ఆలస్యం కావడానికి వీల్లేదని పేర్కొన్నారు. 2029 ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేయకపోతే మహిళలకు అన్యాయం చేసినట్టేనని అన్నారు. రాజకీయాల్లో తమ శక్తి చూపించడానికి మహిళలు సిద్ధంగా ఉన్నారని.. వారికి అవకాశం ఇవ్వాలని తెలిపారు.


