News March 6, 2025
పాడేరు: ‘మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి’

ఈనెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు అల్లూరి జిల్లాలో ఘనంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ కలెక్టరేట్‌లో అధికారులను ఆదేశించారు. నియోజకవర్గం పరిధిలో ప్రతి ITDAలో, అదేవిధంగా మండల స్థాయిలో కూడా నిర్వహించాలని సూచించారు. పాడేరులో కనీసం మూడు వేల మందితో సమావేశం ఏర్పాటు చేయాలని, వివిధ రంగాలలో నిష్ణాతులను, ఉత్తమ సేవలు అందించిన వారిని గుర్తించి వారిని సత్కరించాలని సూచించారు.
Similar News
News November 21, 2025
HYD: నగరంలో పెరుగుతున్న చలి తీవ్రత

హైదరాబాద్‌లో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. కొన్ని ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా చలి రికార్డు సృష్టిస్తోంది. పటాన్‌చెరులో కనిష్ఠ ఉష్ణోగ్రతలు గురువారం సాధారణం కంటే 6.4 తక్కువగా నమోదైంది. రాజేంద్రనగర్‌లో 11.5, హయత్‌నగర్‌లో 12.6 నమోదు కాగా, సగటున గరిష్ఠ ఉష్ణోగ్రత 29.4, కనిష్ఠ ఉష్ణోగ్రత 13.1 డిగ్రీలుగా నమోదైంది.
News November 21, 2025
కామారెడ్డి: కస్తూర్బా విద్యార్థినికి పాముకాటు

రాజంపేటలోని కస్తూర్బా పాఠశాల విద్యార్థినికి పాముకాటుకు గురైంది. గమనించిన తోటి విద్యార్థులు, సిబ్బంది ప్రిన్సిపల్ శ్రీవాణికి చెప్పారు. దీంతో ఆమెను హుటాహుటిన కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న డీఈఓ రాజు అమ్మాయిని పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఆమెకు ఎలాంటి ప్రాణాపాయం లేదని ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు.
News November 21, 2025
అక్టోబర్‌లో ట్యాక్స్ రెవెన్యూ రూ.16,372 కోట్లు

TG: అక్టోబర్‌లో రాష్ట్ర ఖజానాకు అన్ని రకాల పన్నుల కింద రూ.16,372.44 కోట్లు సమకూరినట్లు కాగ్ నివేదిక వెల్లడించింది. ఎక్సైజ్ సుంకాల ద్వారానే రూ.3,675Cr వచ్చినట్లు పేర్కొంది. అక్టోబర్ రెవెన్యూతో కలిపి ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఖజానాకు చేరిన మొత్తం రూ.88,209.10Crకు పెరిగింది. FY26లో పన్నుల కింద మొత్తం రూ.1,75,319.35Cr వస్తాయని ప్రభుత్వం అంచనా వేయగా, ఇప్పటివరకు 50.31% సమకూరింది.


