News April 12, 2025
పాడేరు: మీకోసం కార్యక్రమానికి 110 ఫిర్యాదులు

పాడేరులోని ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ మీకోసం కార్యక్రమానికి 110 ఫిర్యాదులు అందాయి. కలెక్టర్ దినేశ్ కుమార్తో కలిసి జేసీ అభిషేక్ గౌడ, డీఆర్వో కే.పద్మలత వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. రహదారి, తాగునీటి సమస్యలపై అధికంగా ఫిర్యాదులు అందాయి. మీకోసంలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News December 4, 2025
పల్నాడు కోనసీమ మంచికల్లులో పోలేరమ్మ తిరుణాల వైభవం.!

పల్నాటి కోనసీమగా పిలవబడే రెంటచింతల మండలం మంచికల్లు గ్రామ దేవత పోలేరమ్మ తిరునాల మహోత్సవం కోర్ల పౌర్ణమి సందర్భంగా గురువారం రోజున పెద్ద ఎత్తున ప్రారంభమైంది. కొన్ని వందల సంవత్సరాలుగా డిసెంబర్లో వచ్చే పౌర్ణమి కొర్ల పౌర్ణమిగా పరిగణించి ఈ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. తిరుణాలలో మొదట శక్తిని నిలబెట్టి మరుసటి రోజు సాగనంపడం తరతరాల ఆనవాయితీగా వస్తుంది.
News December 4, 2025
ENCOUNTER: 19కి చేరిన మృతుల సంఖ్య

ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో జరిగిన <<18460138>>ఎన్కౌంటర్లో<<>> మృతుల సంఖ్య పెరిగింది. ఇప్పటివరకు 19 మంది మావోలు చనిపోయినట్లు తెలుస్తోంది. మృతుల్లో PLGA-2 కమాండర్ వెల్లా మోడియం కూడా ఉన్నారు. భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. మరోవైపు ఎదురుకాల్పుల్లో నిన్న ముగ్గురు పోలీసులు మరణించిన విషయం తెలిసిందే.
News December 4, 2025
దిత్వా తుఫాన్ ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు

AP: దిత్వా తుఫాను ప్రభావంతో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ జిల్లాల్లో వాగులు, నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. అటు ప్రకాశం, ATP, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, CTR జిల్లాల్లో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్సుందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలకు రహదారులు, తోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.


