News February 14, 2025
పాడేరు మెడికల్ కాలేజీలో ఉద్యోగాల భర్తీపై కలెక్టర్ స్పందన

పాడేరు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 34కేటగిరీలలో ఖాళీగా ఉన్న 244పోస్టులను పారదర్శకంగా భర్తీ చేస్తున్నట్లు కలెక్టర్ దినేశ్ కుమార్ శుక్రవారం తెలిపారు. పోస్టులు అమ్ముకుంటున్నారన్న వదంతులు తన దృష్టికి వచ్చిందని, అటువంటి వదంతులు నమ్మవద్దని, ఎవరూ ఎవరికీ డబ్బులు ఇచ్చి మోసపోవద్దని సూచించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నోటిఫై చేసిన పోస్టులను రోస్టర్ అనుసరించి మాత్రమే భర్తీ చేస్తున్నామన్నారు.
Similar News
News November 28, 2025
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో అప్రెంటిస్ పోస్టులు

హైదరాబాద్-నాచారంలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<
News November 28, 2025
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలి: సీపీ

సర్పంచ్ ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినందున శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు చేపడుతున్నట్లు కరీంనగర్ సీపీ గౌష్ ఆలం తెలిపారు. ఇందులో భాగంగా గతంలో నేర చరిత్ర ఉన్న ఎన్నికల నేరస్థులను బైండోవర్ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో, నిష్పక్షపాతంగా ఎన్నికలు సజావుగా సాగేందుకు అవసరమైన అన్నీ చర్యలు చేపడతామని, ప్రజలు పోలీసులకు సహకరించాలన్నారు.
News November 28, 2025
జిల్లా ఉత్తమ పాఠశాలగా పెదపూడి MPP స్కూల్

పెదపూడి MPP పాఠశాల జిల్లాస్థాయి ఉత్తమ పాఠశాలగా ఎంపికైంది. ఈ విషయాన్ని మండల విద్యాశాఖ అధికారులు విశ్వనాథం, సత్యనారాయణ శుక్రవారం తెలిపారు. డీఈవో రమేష్ నేతృత్వంలోని అధికారుల బృందం మండలంలోని పలు పాఠశాలలను పరిశీలించింది. ప్రభుత్వ పాఠశాలల విద్యాభివృద్ధిలో పెదపూడి పాఠశాల ముందంజలో ఉండటంతో ఈ గుర్తింపు లభించిందని వారు పేర్కొన్నారు.


