News February 14, 2025

పాడేరు మెడికల్ కాలేజీలో ఉద్యోగాల భర్తీపై కలెక్టర్ స్పందన

image

పాడేరు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 34కేటగిరీలలో ఖాళీగా ఉన్న 244పోస్టులను పారదర్శకంగా భర్తీ చేస్తున్నట్లు కలెక్టర్ దినేశ్ కుమార్ శుక్రవారం తెలిపారు. పోస్టులు అమ్ముకుంటున్నారన్న వదంతులు తన దృష్టికి వచ్చిందని, అటువంటి వదంతులు నమ్మవద్దని, ఎవరూ ఎవరికీ డబ్బులు ఇచ్చి మోసపోవద్దని సూచించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నోటిఫై చేసిన పోస్టులను రోస్టర్ అనుసరించి మాత్రమే భర్తీ చేస్తున్నామన్నారు.

Similar News

News March 15, 2025

గవర్నర్ ప్రసంగాన్ని అవహేళన చేశారు: రేవంత్

image

TG: ప్రభుత్వ ఆలోచనలు, చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలనే గవర్నర్ ప్రసంగంలో పొందుపరుస్తారని CM రేవంత్ అసెంబ్లీలో అన్నారు. ‘ఏ ప్రభుత్వమైనా ఇదే చేస్తుంది. అది BRS సభ్యులకూ తెలుసు. అయినా గవర్నర్ ప్రసంగం గాంధీభవన్‌లో కార్యకర్త ప్రసంగంలా ఉందని అవహేళన చేశారు. గతంలో మహిళా గవర్నర్‌ను అవమానించిన చరిత్ర వారిది’ అని విమర్శించారు. మరోవైపు KCRపై CM వ్యాఖ్యలను ఖండిస్తూ BRS సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.

News March 15, 2025

పెద్దపల్లి: జిల్లా పంచాయతీ అధికారిని కలిసిన నూతన కార్యవర్గం

image

టీఎన్జీవో అనుబంధ తెలంగాణ పంచాయతీ సెక్రటరీ సెంటర్ ఫోరం పెద్దపల్లి జిల్లా నూతన కార్యవర్గం శనివారం పెద్దపల్లి జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్యను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శుల సమస్యలు పరిష్కరించాలని డిపివోను కోరగా సమస్యలు ఉన్నతాధికారులకు సిపారసు చేస్తానని డిపివో హామీ ఇచ్చారు. డిపివోను కలిసిన వారిలో టిఎన్జివో జిల్లా అధ్యక్షులు బొంకురి శంకర్, కార్యదర్శులు ఉన్నారు.

News March 15, 2025

బీఆర్ఎస్ వల్లే ఏపీ అక్రమంగా నీటిని తీసుకెళ్లింది: ఉత్తమ్

image

TG: కృష్ణా జలాలపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని, పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెరగడానికి కారణమే ఆ పార్టీ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో ఆరోపించారు. ‘ప్రగతిభవన్‌లో జగన్ మోహన్ రెడ్డితో కేసీఆర్ విందులు వినోదాలు చేసే సమయంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మొదలుపెట్టారు. గత ప్రభుత్వ పదేళ్ల నిర్లక్ష్యం వల్ల శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి ఏపీ అక్రమంగా నీటిని తీసుకెళ్లింది’ అని ఉత్తమ్ మండిపడ్డారు.

error: Content is protected !!