News February 9, 2025

పాడేరు: రానున్న ఐదేళ్లలో రహదారుల నిర్మాణాలు పూర్తి

image

అల్లూరి జిల్లాలో రహదారి సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ శనివారం తెలిపారు. రానున్న ఐదేళ్లలో పూర్తి స్థాయిలో రహదారుల నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు. 250 మంది జనాభా కలిగిన పీవీటీజీ గ్రామాలకు రహదారులు నిర్మిస్తామన్నారు. అలాగే జిల్లాకు 1,537 సెల్ టవర్లు మంజూరు చేయగా, ఇప్పటి వరకూ 965 పూర్తి చేసి మొబైల్ కనెక్టవిటీ సౌకర్యాన్ని కల్పించడం జరుగుతోందని కలెక్టర్ తెలిపారు.

Similar News

News April 16, 2026

WGL: తెర మీదకు పాత నియోజకవర్గ పేర్లు!

image

అసెంబ్లీ స్థానాల పెంపు బిల్లు నేడు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఉమ్మడి జిల్లాలో 12 నుంచి 18 స్థానాలకు పెరిగే అవకాశం ఉంది.దీంతో పెరిగే నియోజకవర్గాలు ఏంటనే చర్చ మొదలైంది. కొత్తగా ఏర్పాటయ్యే నియోజకవర్గాలు, గతంలో కనుమరుగైన నియోజకవర్గాలను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు. శాయంపేట, ధర్మసాగర్, గుడూరు, చేర్యాల, హసన్‌పర్తితో పాటుగా కొత్తగా నెక్కొండ, కాజీపేట నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలంటున్నారు.

News April 16, 2026

టీడీపీ పదవుల్లో ‘పశ్చిమ’కు పెద్దపీట

image

తెలుగుదేశం పార్టీ పదవుల కేటాయింపులో ప.గో. జిల్లాలోని అన్ని సామాజిక వర్గాలకు సముచిత స్థానం దక్కింది. పార్టీ పోలిట్‌బ్యూరోలో నిమ్మల రామానాయుడు, పితాని సత్యనారాయణ, రామరాజు, ఎం.ఏ. షరీఫ్‌లకు చోటు కల్పించగా.. పీతల సుజాతకు జాతీయ స్థాయి పదవి వరించింది. అంగర రామ్మోహన్‌కు మరోసారి కీలక బాధ్యతలు దక్కాయి. సీనియర్లకు ప్రాధాన్యతనిస్తూ సామాజిక సమతుల్యత పాటించడంపై జిల్లా వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది.

News April 16, 2026

ORR అలైన్‌మెంట్‌పై జోక్యం చేసుకోలేం: హైకోర్టు

image

AP: అమరావతి ORR నిర్మాణానికి సంబంధించి విజయవాడ ఆగ్నేయ, ఈశాన్య పరిధిలోని అలైన్‌మెంట్‌ను సవాల్ చేస్తూ దాఖలైన PILపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల విషయంలో కోర్టులు జోక్యం చేసుకోలేవని స్పష్టం చేసింది. ORR నిర్మాణం ఎక్కడ జరగాలో పిటిషనర్ ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించింది. నిపుణుల బృందం ఖరారు చేసిన అలైన్‌మెంట్లలో తాము జోక్యం చేసుకోబోమని తేల్చిచెప్పింది.