News March 19, 2025
పాడేరు: ‘రెవెన్యూ సమస్యలు త్వరగా పరిష్కరించాలి’

రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం పాడేరులో కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. సర్వే ప్రక్రియను తహశీల్దారులు పర్యవేక్షించాలని సూచించారు. భూముల రీ సర్వేకు వారాంతపు లక్ష్యాలను నిర్దేశించాలని పేర్కొన్నారు. ఈ నెలాఖరికి 508 గ్రామాల్లో సర్వే పూర్తి చేయాలని చెప్పారు.
Similar News
News November 25, 2025
త్వరలో వడ్డీ లేని రుణాలు: కలెక్టర్

వరంగల్ జిల్లాలో మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం చేపట్టిన కీలక కార్యక్రమంలో భాగంగా, స్వయం సహాయక మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ సత్య శారద ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు సంబంధిత విభాగాధిపతులు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయాలని ఆమె ఆదేశించారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు.

రిజైండర్లను త్వరగా సమర్పించాలి: ASF కలెక్టర్

దినపత్రికలలో వచ్చే ప్రతికూల వార్తా కథనాలపై సత్వర చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకటేష్ ధోత్రే సూచించారు. సోమవారం ASF కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ డేవిడ్తో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. పత్రికలలో వచ్చే ప్రతికూల వార్తలపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. సత్వర చర్యలపై DPRO నుంచి వచ్చే రిజైండర్లకు తీసుకున్న చర్యలపై సమాచారం అందించాలని ఆదేశించారు.