News February 5, 2025
పాడేరు: లక్ష ఎకరాల్లో కాఫీ విస్తరణకు ప్రతిపాదనలు

లక్ష ఎకరాల్లో కాఫీ విస్తరణకు, నీడ తోటల పెంపకానికి ప్రతిపాదనలు తయారు చేయాలని కలెక్టర్ దినేశ్ కుమార్ అధికారులను మంగళవారం ఆదేశించారు. రానున్న ఐదేళ్లలో లక్ష ఎకరాల్లో కాఫీ విస్తరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని స్పష్టం చేశారు. ప్రతీ సంవత్సరం 20వేల ఎకరాల్లో కాఫీని విస్తరించాలన్నారు. ఉపాధి హామీ పథకంలో నిర్దేశించిన పనులు పూర్తి చేయకుండా కథలు చెప్పొద్దని, ఉపాధి హామీ పనుల పురోగతిపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
Similar News
News December 3, 2025
PM మోదీకి CM రేవంత్ అందించిన వినతులివే

⋆HYD మెట్రో రెండో దశ విస్తరణను కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్గా చేపట్టేందుకు ఆమోదించాలి
⋆RRR ఉత్తర, దక్షిణ భాగం నిర్మాణానికి, మన్ననూర్-శ్రీశైలం 4 వరుసల ఎలివేటేడ్ కారిడార్కు అనుమతులివ్వాలి. RRR వెంట రీజనల్ రింగ్ రైలు ప్రాజెక్టును చేపట్టాలి
⋆HYD-అమరావతి-మచిలీపట్నం పోర్ట్ 12 లేన్ల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే, HYD-BLR గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి చొరవ చూపాలి
News December 3, 2025
ఏఐతో అశ్లీల ఫొటోలు.. X వేదికగా రష్మిక ఫిర్యాదు

అసభ్యకరంగా మార్ఫింగ్ చేసిన తన ఫొటోలు వైరల్ కావడంతో హీరోయిన్ రష్మిక Xలో ఘాటుగా స్పందించారు. ‘AIని అభివృద్ధి కోసం కాకుండా కొందరు అశ్లీలతను సృష్టించడానికి, మహిళలను లక్ష్యంగా చేసేందుకు దుర్వినియోగం చేస్తున్నారు. AIని మంచి కోసం మాత్రమే వాడుకుందాం. ఇలాంటి దుర్వినియోగానికి పాల్పడేవారికి కఠిన శిక్ష విధించాలి’ అని కోరుతూ ‘Cyberdost’కు ట్యాగ్ చేసి ఫిర్యాదు చేశారు.
News December 3, 2025
శివ స్వాములకు ఉచిత స్పర్శ దర్శనం: ఛైర్మన్

శివ స్వాములకు ఉచిత స్పర్శ దర్శనం కల్పిస్తున్నట్లు శ్రీశైల దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ పోతుగుంట రమేశ్ నాయుడు తెలిపారు. బుధవారం Way2Newsతో ఆయన మాట్లాడుతూ.. భక్తుల రద్దీ నేపథ్యంలో ఈనెల 7 వరకు స్పర్శ దర్శనాన్ని సాధారణ భక్తులకు రద్దు చేశామన్నారు. శివ స్వాములకు మాత్రం విడతల వారీగా దర్శన భాగ్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులందరికీ సంతృప్తికర దర్శన భాగ్యం కల్పించటమే తన ధ్యేయమన్నారు.


