News June 27, 2024

పాడేరు: లొంగిపోయిన ఇద్దరు మహిళా మావోయిస్టులు

image

మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలకు విసిగిపోయిన కుంట ఏరియా కమిటీ సభ్యురాలు సోడి సుక్కి, మడివి గంగి జనజీవన స్రవంతిలో కలిశారని అల్లూరి జిల్లా ఎస్పీ తూహీన్ సిన్హా గురువారం తెలిపారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వీరు మావోయిస్టు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారని అన్నారు. అయితే మావోయిస్టు పార్టీకి ప్రజల్లో ఆదరణ తగ్గడం, పార్టీలో ఆదివాసేతర నాయకుల వివక్షత వల్ల లొంగిపోయారని తెలిపారు.

Similar News

News October 16, 2024

ఏయూ: పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్

image

పీజీ డిప్లొమా ఇన్ కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్‌లో ప్రవేశాలకు ఏయూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన వారు ఈనెల 21వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఏడాదికి ఫీజుగా రూ.30 వేల చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు AU వెబ్సైట్ నుంచి పొందవచ్చు. MA, MSC సైకాలజీ, MBBS, BA, BSC సైకాలజీ, MSC సోషల్ వర్క్, BSC నర్సింగ్ కోర్సులు చేసిన వాళ్లు దీనికి అర్హులు.

News October 16, 2024

కసింకోట నేషనల్ హైవేపై యాక్సిడెంట్.. ఇద్దరు స్పాట్‌డెడ్

image

కసింకోట జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున యాక్సిడెంట్ జరిగింది. ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న కసింకోట పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. డివైడర్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. మృతులు నక్కపల్లి ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News October 16, 2024

17న నీతి అయోగ్ సీఈవో విశాఖ రాక

image

ఈనెల 17వ తేదీన నీతి అయోగ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి బీవీఆర్ సుబ్రహ్మణ్యం విశాఖ వస్తున్నారు. ఆయన ఢిల్లీ నుంచి రాత్రి 10.15 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన నగరానికి వెళ్లి బస చేస్తారు. 18వ తేదీన సీఈవో పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అదే రోజు రాత్రి 11.10 గంటలకు తిరిగి ఢిల్లీ వెళతారు.