News January 24, 2025

పాడేరు: ‘లొంగిపోయిన మావోల సమస్యల పరిష్కారానికి కృషి’

image

లొంగిపోయిన మావోయిస్టు దళ సభ్యులకు, మిలీషియా సభ్యులకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటామని ఎస్పీ అమిత్ బర్దార్ హామీ ఇచ్చారు. శుక్రవారం ఆయన జిల్లా ఎస్పీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ కే.ధీరజ్‌తో కలిసి సరళ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా లొంగిపోయిన మావోయిస్టు, మిలీషియా సభ్యుల పిల్లలతో సమావేశం నిర్వహించారు. వారి చదువు, ఉద్యోగ అవకాశాల గురించి అవగాహన కల్పించారు. బాగా చదువుకోవాలన్నారు.

Similar News

News February 24, 2026

పార్వతీపురం: ‘రీసర్వే, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ వేగవంతం కావాలి’

image

రీసర్వే, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ వేగవంతం కావాలని జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ జిల్లా కలెక్టర్లకు తెలిపారు. మంగళవారం జరిగిన వీడియో కాన్ఫిరెన్స్‌లో కలెక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు. రీ సర్వే జరిగే గ్రామాల్లోని సర్వేయర్లు తప్పనిసరిగా సంబంధిత గ్రామంలోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆయన ఆదేశించారు.

News February 24, 2026

రాజకీయాల్లోకి వస్తా : దేవ్ జీ

image

అజ్ఞాతం వీడిన తాను త్వరలోనే రాజకీయాల్లో వస్తానని మావోయిస్టు అగ్రనేత దేవ్ జీ వెల్లడించారు. మంగళవారం తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయిన ఆయన తాను ఏ పార్టీలో చేరుతానో ఇప్పటికిప్పుడే చెప్పలేనన్నారు. రాజకీయాలు మాట్లాడేందుకు ఇది సరైన వేదిక కాదన్న ఆయన త్వరలోనే పార్టీ జీవితంపై ప్రకటన చేస్తానన్నారు. అనారోగ్య కారణంతోనే తాను అజ్ఞాతం వీడానని, వ్యక్తిగత జీవితం కొనసాగించడం కోసం కాదని స్పష్టం చేశారు.

News February 24, 2026

గణపతి అడవిలో లేరు: డీజీపీ

image

మావోయిస్టు పార్టీ అగ్రనేతలు దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి, బడే చొక్కారావు, నూనె నర్సింహారెడ్డి మంగళవారం DGP శివధర్‌ రెడ్డి ఎదుట లొంగిపోయారు. DGP మాట్లాడుతూ.. రెండేళ్లలో 591మంది మావోయిస్టులు లొంగిపోయారని, ప్రస్తుతం అగ్రనేత గణపతి అడవుల్లో లేరని, బయట ఎక్కడో ఆశ్రయం పొందుతున్నట్లు సమాచారం ఉందని వెల్లడించారు. ఇంకా అజ్ఞాతంలో ఉన్న 11 మంది TG నేతల్లో కొందరు పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నారని పేర్కొన్నారు.