News February 20, 2025
పాడేరు: సరళ కార్యక్రమంలో 80 మంది ఇంటర్వ్యూలకు ఎంపిక

సరళ కార్యక్రమంతో గిరిజన యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ తెలిపారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో పెదబయలు, ముంచంగిపుట్టు, మంప, సీలేరు తదితర మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు చెందిన 80 మంది అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించామన్నారు. ఇందులో 60 మంది ఎంపికయ్యారు. వీరికి సీఈఎంఎస్ సంస్థ శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తుందని ఎస్పీ తెలిపారు.
Similar News
News November 21, 2025
వీరుల గుడిలో పల్నాడు ఎస్పీ ప్రత్యేక పూజలు

కారంపూడి వీరుల ఉత్సవాల సందర్భంగా పల్నాడు ఎస్పీ రామకృష్ణారావు శుక్రవారం వీరుల గుడిని సందర్శించారు. పల్నాడు యుద్ధంలో వీరులు వాడిన కొణతాల గురించి పీఠాధిపతి తరుణ్ చెన్నకేశవులును అడిగి తెలుసుకుని ప్రత్యేక పూజలు చేశారు. మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి పల్నాటి వీరుల ఉత్సవాల గురించి ఎస్పీకి వివరించారు.
News November 21, 2025
జొమాటో, స్విగ్గీ కస్టమర్లకు షాక్!

తమ కస్టమర్ల డేటాను లక్షలాది రెస్టారెంట్లతో పంచుకోవాలని జొమాటో, స్విగ్గీలు నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే జొమాటో పైలట్ ప్రాజెక్టు కింద ‘పర్మిషన్’ పాప్ అప్ మెసేజ్‌లను పంపుతోంది. దానిపై క్లిక్ చేస్తే మీ డేటా రెస్టారెంట్లకు చేరుతుంది. త్వరలో ఆటోమేటిక్ అయ్యే అవకాశం ఉంది. దీంతో ఇకపై అన్వాంటెడ్ మెసేజ్‌లు ఇన్‌బాక్స్‌లను ముంచెత్తనున్నాయి. అలాగే డేటా గోప్యతకు భంగం వాటిల్లుతుందని నిపుణులు చెబుతున్నారు.
News November 21, 2025
FEB 15న భారత్-పాకిస్థాన్ మ్యాచ్?

వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్‌లో మరోసారి భారత్-పాక్ తలపడే అవకాశం ఉంది. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా ఈ మ్యాచ్ జరిగే అవకాశం ఉందని క్రీడా వర్గాలు తెలిపాయి. IND సెమీస్‌కు క్వాలిఫై అయితే వాంఖడేలో మార్చి 5న ప్రత్యర్థితో మ్యాచ్ ఆడనుందని పేర్కొన్నాయి. అలాగే FEB 7న టోర్నీ ప్రారంభమై అహ్మదాబాద్‌లో మార్చి 8న ఫైనల్‌తో ముగుస్తుందని వెల్లడించాయి. ఇటీవల T20IWC <<18244536>>వేదికలను<<>> ఖరారు చేసిన విషయం తెలిసిందే.


