News January 27, 2025

పాడేరు: స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబీకులకు సన్మానం

image

గణతంత్ర దినోత్సవం సందర్భంగా పాడేరులో జరిగిన కార్యక్రమంలో స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబీకులను అల్లూరి కలెక్టర్ దినేశ్ కుమార్ శాలువా కప్పి సన్మానించారు. హుకుంపేట మండలంలోని మెలియాపుట్టు గ్రామానికి చెందిన మోరి చిన్నయ్య, డీ.చింతల వీధి గ్రామానికి చెందిన కొర్రా విశ్వనాథాన్ని సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అమిత్ బార్దార్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ, ఐటీడీఏ పీవో వీ.అభిషేక్ పాల్గొన్నారు.

Similar News

News November 8, 2025

నెలకు రూ.10 లక్షలు కావాలా?.. షమీ మాజీ భార్యపై ఫైర్

image

తనకు నెలకు రూ.4 లక్షల భరణం సరిపోవట్లేదని, రూ.10 లక్షలు కావాలని షమీ మాజీ భార్య జహాన్ సుప్రీంకోర్టును ఆశ్రయించడంపై నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. విడాకుల తర్వాత మళ్లీ మాజీ భర్తపై ఆధారపడటం ఎందుకని, సొంతకాళ్లపై నిలబడటం రాదా అని ప్రశ్నిస్తున్నారు. మెయింటెనెన్స్ అనేది కాస్ట్ ఆఫ్ లివింగ్, పిల్లల ఖర్చు ప్రకారం ఉండాలని, ఆదాయం ఆధారంగా కాదని మరికొందరు వాదిస్తున్నారు. దీనిపై మీ కామెంట్?

News November 8, 2025

HYD: పార్కు కాదు.. పచ్చని డంపింగ్ యార్డు

image

డంపింగ్‌ యార్డ్‌ అనగానే చెత్త, చెదారంతో నిండిన దుర్వాసన గూడు గుర్తుకువస్తుంది. కానీ HYD శివారు పీర్జాదిగూడ బల్దియా పర్వతాపూర్‌ డంపింగ్‌ యార్డ్‌ ఆ అభిప్రాయాన్ని తలకిందులు చేస్తోంది. చెత్త మాయమై, పచ్చదనం పరచుకుంది. పచ్చిక బయళ్లు, ఓపెన్‌ జిమ్‌లు అలరారుతున్నాయి. ‘ఇది డంపింగ్‌ యార్డా? లేక పార్కా?’ అనే అనుమానం కలిగిస్తోంది.

News November 8, 2025

గూడూరు: ఒక్కడే కొడుకు.. పుత్ర శోకం మిగిల్చాడు!

image

గూడూరు మండల కేంద్రానికి చెందిన <<18232373>>షేక్ సోహెల్<<>> శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. మండలంలో పత్రిక విలేఖరిగా పనిచేస్తున్న యాకూబ్‌కు ఒక్కగానొక్క తనయుడు సోహెల్. చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. తన తనయుడు ఉద్యోగాలకు ప్రయత్నిస్తూనే తమ మొబైల్ షాప్‌లో చేదోడు వాదోడుగా ఉండేవాడు. కొడుకు ఇక రాడని తండ్రి కన్నీటి పర్యంతమైన తీరు పలువురి హృదయాలను ద్రవింపజేసింది.