News March 22, 2025

పాడేరు: ‘10,500 ఫారంపాండ్స్ నిర్మించాలి’

image

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, దాని పరిధిలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులు, ప్రాజెక్టులపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుక్రవారం సచివాలయం నుంచి వివిధ జిల్లాల కలెక్టర్లతో సమీక్షించారు. అల్లూరి జిల్లాలో ఫారం పాండ్స్‌కు ఎక్కువ అవకాశం ఉన్నందున 10,500 ఫారం పాండ్స్ నిర్మించి నీటి వసతి మెరుగుపరచాలని అల్లూరి జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్‌ను ఆదేశించారు.

Similar News

News December 2, 2025

నేడు భౌమ ప్రదోషం.. శివానుగ్రహం కోసం ఈరోజు సాయంత్రం ఏం చేయాలంటే?

image

త్రయోదశి తిథి, మంగళవారం కలిసి వచ్చిన సందర్భంగా ఈరోజును ‘భౌమ ప్రదోషం’గా పరిగణిస్తారు. ఈ శుభ దినాన సాయంత్రం శివ పార్వతులను పూజిస్తారు. ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం శివాలయానికి వెళ్లి, అభిషేకాలు నిర్వహిస్తే.. మనోభీష్టాలు నెరవేరతాయని నమ్మకం. బిల్వ, ఉమ్మెత్త పూలు, పండ్లు, పెరుగు, తేనె, శమీ ఆకులు సమర్పించి, ‘ఓం నమః శివాయ’ మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే విశేష ఫలితాలుంటాయని అంటున్నారు.

News December 2, 2025

నేడు చెన్నైలో IGNITION సదస్సు.. ముఖ్య అతిథిగా KTR

image

చెన్నైలో ఇవాళ జరిగే శివ్ నాడార్ ఫౌండేషన్ ప్రతిష్ఠాత్మక ‘IGNITION’ సదస్సులో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ‘రిబూటింగ్ ది రిపబ్లిక్’ అనే అంశంపై ప్రసంగిస్తారు. దేశాభివృద్ధిలో రాజకీయాలు, టెక్నాలజీ పాత్ర, ఇన్నోవేషన్ హబ్‌ల ఆవశ్యకత, సమ్మిళిత ఆర్థికాభివృద్ధిపై తన ఆలోచనలు పంచుకోనున్నారు. నేషనల్ పాలిటిక్స్‌పైనా KTR కీలక వ్యాఖ్యలు చేసే అవకాశముంది.

News December 2, 2025

NZB: సర్పంచ్ నుంచి పార్లమెంట్ సభ్యుని దాకా..!

image

నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం కేశ్పల్లిలో జన్మించిన గడ్డం గంగారెడ్డి తొలిసారిగా 1956 నుంచి 1960 వరకు పడకల్ గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు. అనంతరం టీడీపీ నుంచి తొలిసారిగా 1991లో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. 1998 – 2004 మధ్య రెండుసార్లు ఎంపీగా గెలుపొందారు. తెలంగాణ ఉద్యమం ఉద్ధృతంగా ఉన్న సమయంలో టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరారు. 2004 ఎన్నికల్లో డిచ్పల్లి ఎమ్మెల్యేగా గెలిచారు.