News February 5, 2025
పాడేరు: 12వేల మంది విద్యార్ధులతో యోగాసనాలు

వచ్చేనెల 8వ తేదీన 12వేల మంది విద్యార్థులతో యోగాసనాలు నిర్వహించడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ దినేశ్ కుమార్ ఏటీడబ్ల్యూవోలు, ప్రధానోపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులను మంగళవారం ఆదేశించారు. యోగా వలన కలిగే ప్రయోజనాలు వారిని అడిగి తెలుసుకున్నారు. యోగాసనాలు నేర్చుకున్న విద్యార్థుల ఆరోగ్యం, మానసిక స్థితిపై ఆరా తీశారు. యోగా వల్ల కలిగే ప్రయోజనాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు.
Similar News
News December 7, 2025
మెదక్: పల్లెపోరు.. అభ్యర్థుల ఫీట్లు

తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ సర్పంచ్ అభ్యర్థి భీములు మాజీ మంత్రి హరీశ్ రావును కలిశారు. బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేసిన సంతోష్ రెడ్డి అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. దాంతో బీఆర్ఎస్ నాయకులు పోటీలో నిలిచిన భీములుకు మద్దతు ప్రకటించారు. బీఆర్ఎస్ నాయకులు సత్యనారాయణగౌడ్ భీములును నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి వద్దకు తీసుకెళ్లగా అక్కడి నుంచి వెళ్లి హరీశ్ రావును కలిశారు.
News December 7, 2025
నెల్లూరు: సిమ్ కార్డుతో మోసాలు

ఇతరుల వద్ద ఫోన్ తీసుకొని సిమ్ కార్డులను మారుస్తూ, ఓటీపీల సాయంతో నేరాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు చీమకుర్తి సీఐ ప్రసాద్ తెలిపారు. గతనెల 29న అందిన ఫిర్యాదు మేరకు SP హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో దర్యాప్తు సాగిందన్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన శేషయ్య ఓటీపీల సహాయంతో వచ్చిన డబ్బులను బెట్టింగ్ యాప్‌లకు వాడినట్లు గుర్తించి అరెస్ట్ చేశామన్నారు. ఇతని వద్ద రూ.2,60,000 రికవరీ చేసినట్లు తెలిపారు.
News December 7, 2025
వైజాగ్ పోర్టు రికార్డు.. 249 రోజుల్లో 60MMT

AP: విశాఖ పోర్టు సరుకు రవాణాలో రికార్డు సృష్టించింది. ఈ ఫైనాన్షియల్ ఇయర్(2025-26)లో 249 రోజుల్లోనే 60M మెట్రిక్ టన్నుల సరుకును హ్యాండిల్ చేసింది. ఈ ఘనత సాధించడానికి గతేడాది 273రోజులు, 2023-24లో 275డేస్ పట్టింది. వాణిజ్యంలో జరుగుతున్న మార్పులు, మౌలిక వసతుల సవాళ్లను అధిగమించి, ప్రత్యామ్నాయ ట్రాన్స్పోర్ట్ మార్గాలపై దృష్టి సారించడంతోనే ఇది సాధ్యమైనట్లు పోర్టు ఛైర్మన్ అంగముత్తు పేర్కొన్నారు.


