News July 8, 2024
పాణ్యం హత్య కేసులో నలుగురి అరెస్ట్

పాణ్యం మండలంలోని మద్దూరు గ్రామంలో ఈ నెల 2న జరిగిన పెద్ద దస్తగిరి (50) హత్య కేసులో సోమవారం నలుగురు ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లు పాణ్యం సీఐ నల్లప్ప తెలిపారు. వడ్డే రామాంజనేయులు, హరి, శ్రీనివాసులు, రవితేజ అనే వ్యక్తులను అరెస్ట్ చేసి ఒక కారు, హత్యకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈ కేసును త్వరితగతిన ఛేదించిన పోలీస్ సిబ్బందిని సీఐ నల్లప్ప అభినందించారు.
Similar News
News February 24, 2026
కర్నూలు జిల్లా అభివృద్ధిపై మంత్రుల సమీక్ష

మంత్రులు రామానాయుడు, టీజీ భరత్ సమక్షంలో కర్నూలు జిల్లా అభివృద్ధిపై కీలక సమీక్ష జరిగింది. కలెక్టర్ డా.సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఎంపీ నాగరాజు, జిల్లా అధ్యక్షురాలు కృష్ణమ్మ పాల్గొన్నారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు, నిధుల అవసరాలపై నివేదికలు సమర్పించారు. ఈ నెల 26న సీఎం చంద్రబాబు నాయుడితో జరిగే భేటీ కోసం పూర్తి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు అధికారులు, ప్రజాప్రతినిధులు వెల్లడించారు.
News February 24, 2026
ప్రజా ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటాం: SP

పోలీస్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు మొత్తం 122 ఫిర్యాదులు అందాయని SP విక్రాంత్ పాటిల్ తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వినతులను స్వీకరించిన ఎస్పీ, ప్రతి ఫిర్యాదుపై చట్టపరంగా విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని సోమవారం హామీ ఇచ్చారు. విచారణ జరిపి న్యాయం చేస్తామని, ఉద్యోగాల పేరుతో డబ్బులు తీసుకుని మోసం చేసిన ఘటనలు, ఫైనాన్స్ మోసాలు, బంగారు దుకాణ వివాదం వంటి ఫిర్యాదులు వచ్చాయన్నారు.