News January 24, 2025
పాతపట్నం: యువతి నుంచి ఫోన్ కాల్.. నిండా ముంచారు

హనీ ట్రాప్‌తో శ్రీకాకుళం జిల్లా పాతపట్నంకు చెందిన రామారావు మోసపోయాడు. ఈనెల 18న ఓ యువతి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. 19న పెద్దిపాలెం వెళ్తుండగా.. మరోసారి ఆమె నుంచి ఫోన్ వచ్చింది. ఇంతలో సంగివలస మూడుగుళ్ల వద్దకు రావాలని యువతి చెప్పగా.. అతడు అక్కడికి చేరుకోగానే నలుగురు వ్యక్తులు ఆయనను బైక్ ఎక్కించుకొని విజయనగరం వైపు తీసుకుపోయారు. మధ్యలో ఆయన వద్ద నుంచి రూ.50 వేల నగదు దోచుకున్నారు.
Similar News
News February 9, 2025
‘తండేల్’ సినిమాలో మూలపేట మహిళ

ఇటీవల విడుదలైన ‘తండేల్’ సినిమాలో నటించే అరుదైన అవకాశం మూలపేటకు చెందిన రాజ్యలక్ష్మి (రాజి)కి దక్కింది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం సముద్ర తీర ప్రాంతమైన మూలపేట గ్రామానికి చెందిన ఆమె, ఇంతకుముందు పలు సీరియల్, సినిమాల్లో నటించారు. కూలీ నిమిత్తం వెళ్లి పాకిస్థాన్ జైల్లో ఉంటున్న వ్యక్తి భార్యగా, ఆమె మత్స్యకార మహిళ పాత్రలో ‘తండేల్’ సినిమాలో నటించడం విశేషం.
News February 9, 2025
కోటబొమ్మాళి: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స పొందుతూ సంతబొమ్మాళికి చెందిన రామారావు శనివారం కన్నుమూశారు. ఎస్సై వెంకటేశ్వరరావు కథనం..అతను జనవరి 28న భార్యను మద్యం తాగేందుకు డబ్బులు అడగగా .. మందలించిందని విషం తాగాడు. గమనించిన రామారావు కుమారుడు కుటుంబీకులకు సమాచారమిచ్చి ఆసుపత్రిలో చేర్చారు. కాగా చికిత్స పొందుతూ కోలుకోలేక శనివారం మృతిచెందారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
News February 9, 2025
శ్రీకాకుళం: తాను చనిపోతూ చూపునిచ్చాడు

శ్రీకాకుళం పట్టణం బ్యాంకర్స్ కాలనీలో నివాసం ఉంటున్న బురిడి ముఖలింగం (75) శనివారం మృతి చెందారు. అతని నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకుని రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్మన్ జగన్మోహన్ రావుకు తెలిపారు. మగటపల్లి కళ్యాణ్ నేత్ర సేకరణ కేంద్రానికి చెందిన ఐ టెక్నీషియన్ సుజాత, జగదీశ్, పవన్ అతని కార్నియాలు సేకరించారు. విశాఖపట్నం ఎల్.వి నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారు.