News January 27, 2025
పాతబస్తి మెట్రో కోసం.. భగాయత్ లేఅవుట్ల వేలం..!

HYD ఉప్పల్ భగాయత్ లేఅవుట్ వద్ద ఓపెన్ ప్లాట్ల వేలం ద్వారా నిధులు సమీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నిధులను MGBS నుంచి చాంద్రాయణగుట్ట వరకు నిర్మించే 7.5KM పాతబస్తీ మెట్రో కారిడార్ నిర్మాణానికి వినియోగించే అవకాశం ఉంది. మరోవైపు, ఈ మెట్రో మార్గంలో ఉండే సుమారు 100 మత, వారసత్వ, సున్నిత నిర్మాణాలను పరిరక్షించేందుకు మెట్రో రైలు సంస్థ ఇంజనీరింగ్ పరిష్కారాలను డెవలప్ చేసింది.
Similar News
News March 15, 2026
వైభవంగా భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణం

భద్రాచలం రామయ్య నిత్య కళ్యాణ వేడుకను ఆదివారం వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ స్వామివారిని గర్భగుడి నుంచి ఊరేగింపుగా బేడ మండపంలో కొలువు తీర్చారు. అనంతరం విశ్వక్సేన పూజ, పుణ్య వాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ ధారణ గావించి నిత్య కళ్యాణ వేడుకను అర్చకులు నిర్వహించారు.
News March 15, 2026
‘ఉగాది’ పండుగ ఎప్పుడు?

అమావాస్య గడియలు ఉండటంతో తెలుగు కొత్త సంవత్సరాది ‘ఉగాది’ ఎప్పుడు జరుపుకోవాలనే అయోమయం కొందరిలో నెలకొంది. అయితే చైత్ర శుక్ల పాడ్యమి రోజైన ఈ నెల 19(గురువారం)నే ఉగాది జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. 19న ఉదయం 6.52 గంటలకు ‘పరాభవ నామ సంవత్సరం’ మొదలవుతుందని పేర్కొంటున్నారు. అదేరోజు ఇంట్లో షడ్రుచులతో ఉగాది పచ్చడి తయారుచేసి స్వీకరించాలని సూచిస్తున్నారు.
News March 15, 2026
గర్భాశయ క్యాన్సర్ నివారణకు టీకా రక్షణ: డీఎంహెచ్‌ఓ

మహిళల్లో ప్రాణాంతకంగా మారుతున్న గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను నివారించేందుకు HPV టీకాలు వేయించాలని HNK DMHO అప్పయ్య పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో వచ్చే క్యాన్సర్లలో రొమ్ము క్యాన్సర్ మొదటిది కాగా, గర్భాశయ క్యాన్సర్ రెండో స్థానంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 14 ఏళ్లలోపు బాలికలకు ఈ టీకా వేయించడం ద్వారా 93 నుంచి 100 శాతం వరకు క్యాన్సర్ నివారణ సాధ్యమని వైద్య అధ్యయనాలు చెబుతున్నాయన్నారు.


