News July 22, 2024

పాతబస్తీ బోనాల జాతరకు గవర్నర్ రాధాకృష్ణకు ఆహ్వానం

image

HYD పాతబస్తీలోని హరిబౌలి శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి దేవాలయంలో నిర్వహించే బోనాల జాతర ఉత్సవాలకు హాజరు కావాలని కోరుతూ సోమవారం రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణను ఆలయ కమిటీ ప్రతినిధులు దత్తాత్రేయ, సతీశ్, రాజారత్నం కలిసి ఆహ్వానించారు. ఈ మేరకు ఆహ్వాన పత్రాన్ని ఆయనకు అందజేశారు. ఈనెల 18వ తేదీన ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమంతో బోనాల ఉత్సవాలు ఘనంగా ప్రారంభించామని తెలిపారు. 

Similar News

News November 8, 2025

Tragedy: ఉప్పల్‌లో కానిస్టేబుల్ సూసైడ్

image

ఉప్పల్‌లో కానిస్టేబుల్ సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. మల్లికార్జుననగర్‌లో నివాసం ఉంటోన్న శ్రీకాంత్(42) 2009 బ్యాచ్‌కు చెందిన PC. ఫిలింనగర్‌ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఆయన అక్టోబర్ 23 నుంచి విధులకు కూడా హాజరుకానట్లు తెలుస్తోంది. శనివారం ఇంట్లో ఉరేసుకున్నాడు. ఆర్థిక సమస్యలే సూసైడ్‌కు కారణమని సమాచారం. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News November 8, 2025

హైదరాబాద్‌ మెట్రో ఛార్జీల పెంపు లేదు: HMRL

image

HYD మెట్రో ఛార్జీల పెంపు అని వస్తోన్న వార్తలపై HMRL క్లారిటీ ఇచ్చింది. తక్షణమే ఛార్జీలు పెంచే ఆలోచన లేదని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలతోనే మెట్రో సేవలు కొనసాగనున్నాయని స్పష్టం చేశారు. కేంద్రం ఏర్పాటు చేసిన ఛార్జీల నిర్ధారణ కమిటీ సిఫారసుల ఆధారంగా మే 24, 2025 నుంచి ఛార్జీల సవరణ అమలు చేశామని గుర్తు చేశారు. ఛార్జీల పెంపు అవాస్తవమని FactCheck_Telangana ధ్రువీకరించింది.
SHARE IT

News November 8, 2025

హైదరాబాద్ మాజీ క్రికెటర్‌కు అరుదైన గౌవరం

image

మిథాలి రాజ్.. హైదరాబాదీ మాజీ క్రికెటర్.. మహిళా క్రికెట్‌లో ఎన్నో సంచలనాలు నమోదు చేసిన గొప్ప క్రీడాకారిణి. వివిధ మ్యాచ్‌లో గెలిపించి భారత క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక పేజీని లిఖించుకున్న బ్యాట్స్ ఉమెన్.. ఇప్పడు మిథాలికి అరుదైన గౌరవం దక్కింది. ఐసీసీలో జరిగిన సమావేశంలో మిథాలికి ఐసీసీ ఉమెన్ క్రికెట్ కమిటీలో చోటు కల్పించింది. దీంతో హైదరాబాద్ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.