News February 14, 2025

పాత గాజువాకలో యాక్సిడెంట్.. ఒకరు స్పాట్‌డెడ్

image

పాత గాజువాక జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. గాజువాక పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 14, 2025

అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాల ప్రచారం ఫేక్: ఈఓ

image

సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ దేవస్థానంలో అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల నియామకం జరుగుతుందనే ప్రచారాన్ని నమ్మవద్దని ఆలయ ఈఓ సుబ్బారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వాట్సాప్ /సోషల్ మీడియా గ్రూపుల్లో ఈ ప్రచారం జరుగుతుందని దేవస్థానం దృష్టికి వచ్చిందన్నారు. ఆలయానికి సంబంధించి ఎలాంటి ఉద్యోగాలు ప్రకటనలు ఇవ్వలేదని స్పష్టం చేశారు. తప్పుడు ప్రకటనలను నమ్మి నిరుద్యోగులు మోసపోవద్దని సూచించారు.

News March 14, 2025

విశాఖ జూలో చిరుత మృతి.. కారణమిదే..!

image

విశాఖ జూ పార్క్‌లో 2008 నుంచి ఉంటున్న ‘సుధ’ అనే ఆడ చిరుతపులి గురువారం సాయంత్రం మృతి చెందినట్లు జూక్యూరేటర్ మంగమ్మ వెల్లడించారు. 20 సంవత్సరాల వయసు కలిగిన ఈ చిరుత మయోకార్డియల్ ఇన్‌ఫార్జన్ డిసీజ్ కారణంగా మృతి చెందినట్లు వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ వెల్లడించారన్నారు. దీని సగటు జీవిత కాలం 12 నుంచి 15 సంవత్సరాలు కాగా జూ సంరక్షణలో ఉండడంతో 20 సంవత్సరాలు జీవించిందన్నారు.

News March 14, 2025

విశాఖలోని 13 రైతు బజార్లో నేటి కాయగూరల ధరలు

image

విశాఖ 13 రైతు బజార్‌లో శుక్రవారం నాటి కూరగాయ ధరలను అధికారులు ఈ విధంగా నిర్ణయించారు. (KG/రూలలో) టమాటా రూ.15, ఉల్లి రూ.23/28, బంగాళదుంపలు రూ.16, దొండకాయలు రూ 38,మిర్చి రూ.26, బెండ రూ.44, బీరకాయలు రూ.50, క్యారెట్ రూ.22/34, బీట్రూట్ రూ.18, బీన్స్ రూ.52, గ్రీన్ పీస్ రూ.54, వంకాయలు రూ.36/40, కీర రూ.26, గోరు చిక్కుడు రూ.38, కాకరకాయ రూ.42,పొటల్స్ రూ.90, దోసకాయలు రూ.28గా నిర్ణయించారు.

error: Content is protected !!