News February 14, 2025
పాత గాజువాకలో యాక్సిడెంట్.. ఒకరు స్పాట్‌డెడ్

పాత గాజువాక జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. గాజువాక పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 27, 2025
నిత్యవసర వస్తువుల ధరల నియంత్రణపై దృష్టి సారించాలి: జేసీ

మార్కెట్లో నిత్యవసర వస్తువుల ధరల నియంత్రణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను జేసీ మయూర్ అశోక్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో జిల్లా ధరల నియంత్రణ కమిటీతో సమావేశం అయ్యారు. ప్రస్తుతం పప్పులు, బియ్యం ధరలు అధికంగా ఉన్నాయన్నారు. రైతు బజార్లు, బయట మార్కెట్లలో ధరలను పరిశీలించాలన్నారు. మార్కెట్లో ధరలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
News March 27, 2025
విశాఖ నుంచి చర్లపల్లికి ప్రత్యేక రైలు

వరుస పండుగల సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విశాఖ నుంచి చర్లపల్లికి స్పెషల్ (08579/80) స్పెషల్ ఎక్స్‌ప్రెస్ నడపనున్నట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం సందీప్ గురువారం తెలిపారు. ఈ రైళ్లు విశాఖ నుంచి మార్చి 28, ఏప్రిల్ 1 తేదీల్లో బయలుదేరి మరుసటి రోజు చర్లపల్లికి చేరుతాయి. మళ్లీ మార్చి 29, ఏప్రిల్ 2వ తేదీల్లో చర్లపల్లి నుంచి బయలుదేరి విశాఖ చేరుతాయని ప్రయాణికులు గమనించాలని కోరారు.
News March 27, 2025
ఏప్రిల్ 1 నుంచి మీటర్ రీడర్లు రాష్ట్ర వ్యాప్త సమ్మె

ఏప్రిల్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్త మీటర్ రీడర్లు సమ్మె నిర్వహించనున్నట్లు ఏపీ విద్యుత్ మీటర్ రీడర్లు రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు బాల కాశి అన్నారు. గురువారం విశాఖ ఈపీడీసీఎల్ జోనల్ కార్యాలయంలో ఈపీడీసీఎల్ సీఎండీకి డిమాండ్ల పత్రం అందజేశారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలను విడనాడాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు.