News February 16, 2025
పాదయాత్రగా శ్రీశైలం వెళ్లే భక్తుల రూట్ మ్యాప్

మహాశివరాత్రి వేడుకలు ఈనెల 19 నుంచి శ్రీశైలంలో ప్రారంభం కానున్న నేపథ్యంలో సుదూర ప్రాంతాల నుంచి పాదయాత్రతో భక్తులు, శివ స్వాములు ముందస్తుగానే పాదయాత్రతో శ్రీశైలం చేరుకుంటున్నారు. అటవీశాఖ కేవలం ఆత్మకూరు, వెంకటాపురం నుంచి మాత్రమే దట్టమైన నల్లమల అటవీ ప్రాంతం మీదుగా భక్తులు పాదయాత్రగా వెళ్లేందుకు అనుమతిచ్చారు. దాదాపు 40 కిలోమీటర్ల మేర కాలినడకన భక్తులు శ్రీశైలం చేరుకోవాల్సి ఉంటుంది.
Similar News
News November 23, 2025
తల్లి పాలల్లో యురేనియం ఆనవాళ్లు.. కానీ!

ఈ ప్రపంచంలో తల్లి పాలను మించిన పోషకాహారం లేదు. కానీ మారిన వాతావరణ పరిస్థితులతో వాటిలోనూ రసాయనాలు చేరుతున్నాయి. తాజాగా బిహార్ తల్లుల పాలల్లో యురేనియం(5ppb-పార్ట్స్ పర్ బిలియన్) ఆనవాళ్లు గుర్తించినట్లు NDMA సైంటిస్ట్ దినేశ్ వెల్లడించారు. అయితే WHO అనుమతించిన స్థాయికంటే తక్కువగానే ఉన్నాయని, దీనివల్ల ప్రస్తుతానికి ప్రమాదం లేదని చెప్పారు. నీటిలో మాత్రం 6 రెట్లు ఎక్కువగా యురేనియం ఆనవాళ్లు ఉన్నాయన్నారు.
News November 23, 2025
ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీగా బాపట్ల ఎస్పీ

బాపట్ల ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీగా నియమించబడ్డారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా ఎస్పీగా ఉన్న హర్ష వర్ధన్ రాజు డిసెంబర్ 2 వరకు సెలవుల్లో ఉన్నారు. ఆ సమయంలో బాపట్ల ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ప్రకాశం జిల్లాకు ఇన్ఛార్జ్ ఎస్పీగా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈ మేరకు బాపట్ల ఎస్పీ కార్యాలయ ప్రతినిధులు ఆదివారం ఈ విషయాన్ని ఒక ప్రకటన ద్వారా తెలిపారు.
News November 23, 2025
ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీగా బాపట్ల ఎస్పీ

ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీగా బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వర్ నియమించబడ్డారు. ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు డిసెంబర్ రెండు వరకు సెలవుల్లో ఉండడంతో, ప్రభుత్వం ఈ మేరకు బాపట్ల ఎస్పీని ఇన్ఛార్జ్గా నియమించింది. దీనితో జిల్లా బాధ్యతలను బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వర్ చేపట్టారు. డిసెంబర్ మూడో తేదీన ఎస్పీ హర్షవర్ధన్ రాజు మళ్లీ విధుల్లో చేరనున్నారు.


