News February 16, 2025
పాదయాత్రగా శ్రీశైలం వెళ్లే భక్తుల రూట్ మ్యాప్

మహాశివరాత్రి వేడుకలు ఈనెల 19 నుంచి శ్రీశైలంలో ప్రారంభం కానున్న నేపథ్యంలో సుదూర ప్రాంతాల నుంచి పాదయాత్రతో భక్తులు, శివ స్వాములు ముందస్తుగానే పాదయాత్రతో శ్రీశైలం చేరుకుంటున్నారు. అటవీశాఖ కేవలం ఆత్మకూరు, వెంకటాపురం నుంచి మాత్రమే దట్టమైన నల్లమల అటవీ ప్రాంతం మీదుగా భక్తులు పాదయాత్రగా వెళ్లేందుకు అనుమతిచ్చారు. దాదాపు 40 కిలోమీటర్ల మేర కాలినడకన భక్తులు శ్రీశైలం చేరుకోవాల్సి ఉంటుంది.
Similar News
News April 10, 2026
PDPL: హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

కాచాపూర్ హత్య కేసులో నిందితుడు జాడి కనుకయ్యకు జీవితకాల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ పెద్దపల్లి కోర్టు జడ్జి కె.సునీత తీర్పు ఇచ్చారు. 2024లో అల్లుడు చేత్తయ్యను హత్య చేసిన కేసులో సాక్ష్యాధారాలు రుజువు కావడంతో ఈ శిక్ష పడింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ డొంకెన రవి వాదనలు వినిపించగా, శిక్ష పడటంలో కృషి చేసిన CI జి.సుబ్బారెడ్డి, SI సనత్ కుమార్, దర్యాప్తు బృందాన్ని CP అంబర్ కిషోర్ ఝా అభినందించారు.
News April 10, 2026
ఫిట్‌గా ఉంటే హెల్తీగా ఉన్నట్లేనా?

చాలామంది ఫిట్‌గా ఉంటే హెల్తీగా ఉన్నట్లే అనుకుంటారు. కానీ రెండూ వేరు. హెల్త్ మన శరీరం లోపల అవయవాలు ఎలా పనిచేస్తున్నాయనే దానిపై ఆధారపడి ఉంటుంది. మంచి నిద్ర, బ్యాలెన్స్‌డ్ ఫుడ్, తక్కువ స్ట్రెస్ ఉంటే హెల్తీగా ఉన్నట్లు లెక్క. మరోవైపు ఫిట్‌నెస్ అంటే శారీరక సామర్థ్యం. బరువులు ఎత్తడం, వేగంగా పరుగెత్తడం వంటివి ఫిట్‌నెస్‌ను సూచిస్తాయి. ఒక బాడీబిల్డర్ చూడటానికి చాలా ఫిట్‌గా ఉన్నా లోపల హెల్తీగా లేకపోవచ్చు.
News April 10, 2026
OFFICIAL: ఫ్యూచర్ సిటీ పనులు షురూ!

HYD ఫ్యూచర్ సిటీ కల సాకారమయ్యే దిశగా తొలి అడుగు పడింది. మీర్‌ఖాన్‌పేటలోని ఫార్మా సిటీలో రూ.4.73 కోట్లతో భారీ స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ పనులకు TGIIC పనులు మొదలుపెట్టనుంది. కందుకూరులో అత్యాధునిక రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థతో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. వర్షపు నీరు సాఫీగా వెళ్లేలా ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు. ఫ్యూచర్ సిటీలో వర్షపు నీరు నిలవకుండా, వరద ముప్పు లేకుండా చర్యలు తీసుకొంటున్నారు.


