News March 18, 2025
పానగల్: విద్యార్థులు పెద్ద కలలు కనండి: జిల్లా ఎస్పీ

పానగల్ మండలం మహమ్మదాపూర్ ఉన్నత పాఠశాలలో పాఠశాల వార్షికోత్సవం,10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ రావుల గిరిధర్,జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ గోవర్ధన్ సాగర్ హాజరయ్యారు. పాఠశాల జీహెచ్ఎం ఆనంద్,ఉపాధ్యాయ బృందం, మాజీ సర్పంచ్ జయరాములు సాగర్ వారికి స్వాగతం పలికారు. ఎస్పీ మాట్లాడుతూ.. విద్యార్థులు పెద్ద కలలు కని, వాటిని సాధించాలన్నారు.
Similar News
News October 30, 2025
HYD: 1987 నాటి రైలు ఎలా ఉండేదో తెలుసా?

1987 నాటి ఈ అందమైన ఫొటో నాటి రైల్వే వ్యవస్థను గుర్తుచేస్తోంది. సికింద్రాబాద్ స్టేషన్కి అకోలా జంక్షన్ నుంచి వచ్చిన ప్రయాణికులను YP 2865 లోకోమోటివ్ రైలు పొగలు కక్కుతూ, కూ.. అంటూ కూతవేస్తూ లాగేది. 1960ల చివర్లో టాటా కంపెనీ టెల్కో, జంషెడ్పూర్లో ఈ YP ఇంజిన్ తయారు చేసిందని IRAS అనంత్ తెలిపారు. తను ఉద్యోగంలో చేరిన సమయంలో రైల్వే అనుభూతులను గుర్తు చేసుకున్నారు.
News October 30, 2025
GNT: తొలగిన తుపాన్ ముప్పు.. సాధారణ స్థితికి జనజీవనం

తుపాను భయంతో కొద్ది రోజులుగా బిక్కు బిక్కు మంటూ ఇంటిపట్టునే కాలం గడిపిన జనం నెమ్మదిగా తేరుకుంటున్నారు. తుపాను తీరం దాటి ముప్పు తొలగిపోవడంతో రోజువారి కార్యక్రమాల్లో నిమగ్నమవుతున్నారు. వర్షం ముసురు తొలగి సూర్య భగవానుడి రాకతో ఊపిరి పీల్చుకొంటున్నారు. సెలవుల అనంతరం విద్యా సంస్థలు కూడా తెరవడంతో పిల్లలు బడిబాట పట్టారు. దాదాపు నాలుగు రోజుల తర్వాత వీధులన్నీ రద్దీగా మారి జనజీవనం సాధారణ స్థితికి వచ్చింది.
News October 30, 2025
TTDలో కల్తీ నెయ్యి.. వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏ అరెస్ట్..!

టీటీడీలో కల్తీ నెయ్యి వ్యవహారం కేసులో ఒంగోలు మాజీ ఎంపీ, మాజీ TTD చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏ అప్పన్నను నిన్న రాత్రి సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. బ్లాక్ లిస్ట్లో ఉన్న బోలెబాబా డెయిరీ వేరొక డెయిరీని ముందు పెట్టి.. కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ విషయం తెలిసినా కమీషన్ల కోసం అంతా సైలెంట్ అయ్యారనే ఆరోపణలపైనా సిట్ విచారణ సాగిస్తుంది. ఈ క్రమంలో అప్పన్నను అరెస్ట్ చేశారు.


